ఒకే రోజు మూడు సినిమాలతో టాలీవుడ్ మోతెక్కిపోయింది ఈ శుక్రవారం. ఈ మూడు సినిమాల్లో ఏది కూడా పూర్తి నెగెటివ్ టాక్ తెచ్చుకోకపోవడం విశేషం. ‘నేనే రాజు నేనే మంత్రి’కి బిలో యావరేజ్ టాక్ వినిపిస్తుండగా.. ‘లై’ ఎబోవ్ యావరేజ్ అంటున్నారు. ‘జయ జానకి నాయక’కు హిట్ టాక్ వినిపిస్తోంది. మూండింట్లో కమర్షియల్ గా బాగా వర్కవుటయ్యే అవకాశం కూడా దీనికే ఉంది. మామూలుగా శుక్రవారం వచ్చిందంటే.. ఇక్కడ రిలీజయ్యే ఒకట్రెండు తెలుగు సినిమాల గురించి పట్టించుకున్నాక మన ప్రేక్షకుల దృష్టి తమిళం.. హిందీ సినిమాల మీదికి మళ్లుతుంది. కానీ ఈ శుక్రవారం ఇక్కడే మూడు క్రేజీ మూవీస్ రావడంతో వాటి మీదే ఫోకస్ నిలిచింది.
ఐతే ఈ శుక్రవారం బాలీవుడ్.. కోలీవుడ్లలోనూ రెండు ఆసక్తికర సినిమాలొచ్చాయి. హిందీలో అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’.. తమిళంలో ధనుష్ సినిమా ‘వీఐపీ-2’ విడుదలయ్యాయి. వీటిలో ‘టాయిలెట్..’ సినిమాకు చాలా మంచి టాక్ వినిపిస్తోంది. దేశంలో అతి పెద్ద సామాజిక సమస్యల్లో ఒకటైన ‘బహిరంగ మల విసర్జన’ గురించి.. మరుగుదొడ్ల అవసరం గురించి వినోదాత్మకంగా.. ఆలోచింపజేసేలా సినిమాను తీర్చిదిద్దిన తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓ పెద్ద సమస్యను డిస్కస్ చేస్తూ.. జనరంజకంగా సినిమా తీయడంపై అందరూ శభాష్ అంటున్నారు. ఇదొక గొప్ప సినిమా అని చెబుతున్నారు. ఇక ‘వీఐపీ’ సినిమాకైతే మిక్స్డ్ టాక్ వస్తోంది. ‘వీఐపీ’ (రఘువరన్ బీటెక్)కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదని.. తొలి భాగం ఫార్మాట్లోనూ ఇదీ సాగిపోతుందని పెదవి విరుస్తున్నారు. ఐతే ధనుష్ పెర్ఫామెన్స్ అదిరిందని.. అతడికి.. కాజోల్ కు మధ్య వచ్చే సన్నివేశాలు పండాయని.. ఓవరాల్ గా పైసా వసూల్ సినిమా అని చెబుతున్నారు.