‘బాహుబలి: ది కంక్లూజన్’ తెలుగులోనే కాదు.. హిందీలోనూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టరే. దేశవ్యాప్తంగా ఈ చిత్ర హిందీ వెర్షనే రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఆ సినిమా దెబ్బకు మిగతా బాలీవుడ్ సినిమాలు కుదలేయ్యాయి. దానికి ముందు.. తర్వాత వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. జనాలు బాహుబలి హ్యాంగోవర్లోనే ఉండిపోయి మిగతా సినిమాల్ని పెద్దగా పట్టించుకోలేదు. ‘బాహుబలి-2’తో పతాక స్థాయి వినోదాన్నందుకున్న ప్రేక్షకులకు మిగతా సినిమాలు ఆనలేదు. అదే సమయంలో వీక్ కంటెంట్ వల్ల కూడా సినిమాలు దెబ్బ తిన్నాయి. ట్యూబ్ లైట్.. జబ్ హ్యారీ మెట్ సెజాల్ లాంటి పెద్ద సినిమాలు కూడా తేడా కొట్టేశాయి.
ఐతే ఎట్టకేలకు బాలీవుడ్ కు ఊరటనిచ్చే హిట్టు వచ్చింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లు కూడా సాధిస్తోంది. తొలి రోజు ఇండియాలో రూ.13 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. టాక్ చాలా బాగుండటంతో శనివారం మరింతగా పుంజుకుని రూ.17.5 కోట్ల దాకా కొల్లగొట్టింది. వీకెండ్ మొత్తంలో ఇండియా వసూల్లు రూ.50 కోట్ల దాకా ఉంటాయని భావిస్తున్నారు. ఫుల్ రన్లో ఈ చిత్రం భారీగానే వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మరుగుదొడ్ల ప్రాధాన్యాన్ని వినోదాత్మకంగా చెబుతూ అక్షయ్ కుమార్-భూమి జంటగా నారాయణ్ సింగ్ ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ను రూపొందించాడు. ఈ సినిమా వినోదాత్మకంగా ఉంటూనే మంచి సందేశాన్ని జనాలకు చేరవేస్తోంది. నరేంద్ర మోడీ మానస పుత్రిక అయిన ‘స్వచ్ఛ భారత్’ పథకానికి ఈ సినిమా మంచి ప్రచారం కల్పిస్తోంది.