మీడియాకు సినిమా చూపించట్లేదు

Update: 2017-08-12 06:21 GMT
ఒక సినిమాను తీయాలంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కొన్ని సినిమాలు మొదలు పెడితే అసలు చివర వరకు పూర్తవవుతాయో కూడా తెలియదు. ఒక్కోసారి సినిమా కూడా ఆగిపోవచ్చు. అలాగే బడ్జెట్ విషయంలో కూడా చాలా సమాస్యలను ఎదుర్కొంటారు సినిమా తీసేవాళ్ళు. అయితే ఎట్టకేలకు నమ్మకం ఉంచి  కష్టపడి షూటింగ్స్ ను పూర్తి చేస్తారు. ఇక రిలీజ్ చేసిన తర్వాత  ఎలాగైనా మొదట పెట్టిన బడ్జెట్ వస్తే చాలు అనుకుంటారు.

అయితే గత కొంత కాలంగా సినిమాల గురించి ఎక్కువగా రాస్తున్న మీడియా వల్ల కాస్త కలెక్షన్స్ పై ప్రభావం చూపెడుతుంది అంటున్నారు. పాజిటివ్ గా ఉంటె పర్వాలేదు కానీ నెగిటివ్ గా ఉంటేనే కొందరికి నచ్చడం లేదు. ఇప్పుడు బాలీవుడ్ కూడా ఆలానే వ్యవహరిస్తోంది. ప్రస్తుతం సినిమా రిలీజ్ అయ్యే వరకు మీడియాకు ఏ మాత్రం సినిమాను షో చూపెట్టడం లేదు. శుక్రవారం ఉదయం వరకు సినిమాకు సంబందించి ఏ విషయాన్ని బయటపెట్టడానికి ఆసక్తి చూపెట్టడం లేదు కొందరు బాలీవుడ్ ప్రముఖులు. రీసెంట్ గా షారుక్ "జబ్ హరి మెట్ సాజల్" అలాగే రన్ బీర్ కపూర్ " జగ్గా జాసూస్" సినిమాల నిర్మాతలు కూడా మీడియాకు ప్రీమియర్ షో వేయడానికి నిరాకరించాయి.

అయితే ఆ సినిమాలు చాలా వరకు మీడియాకు విడుదల రోజు వరకు చూపెట్టలేదు. అలాగే అక్షయ్ కుమార్ "టాయిలెట్" సినిమా కూడా అదే బాటలో వెళ్ళింది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖులందరు ఇదే బాటలో నడుస్తున్నారట. అయితే ఇంతకుముందు చాలా సినిమా వాళ్ళు మీడియాకు ఓక రోజు ముందే షోలు వేసేవారు. కానీ ప్రముఖ ఫాక్స్ - యాష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చే సినిమాలు మాత్రం వేసేవారు కాదు. అయితే ఇప్పుడు అందరు వీరి తరహాలోనే ప్రవర్తిస్తుండడం అక్కడి మీడియా ప్రతినిధులకు కాస్త కోపం తెప్పిస్తోందట. రీసెంట్ గా రాజ్ సేన్ అనే క్రిటిక్ చేసిన ఓ కామెంట్ చర్చనీయాంశంగా మారింది. సినిమా బావుంటే చూపించడానికి ఎందుకు భయం. ఇప్పుడు అందరూ ఈ తరహాలో ఆలోచించడం మంచిదికాదని కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News