ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు నిర్వహించిన సమావేశం ముగిసింది. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంభందించిన అంశాలతో పాటు ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న ఇతర సమస్యలపై సినీ పెద్దలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీలో ప్రస్తావించారని తెలుస్తోంది. ఈ భేటీకి టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, డైరెక్టర్ రాజమౌళి, నిర్మాతలు సి. కళ్యాణ్, డి. సురేష్ బాబు, దిల్ రాజు, పీవీపీ, దామోదర్ ప్రసాద్ లు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఇప్పటికే దేశంలోనే మొదటగా ఏపీ ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతి ఇచ్చి సింగిల్ విండో పద్దతిలో అనుమతులు ఇచ్చేలా జీవో జారీ చేసిన నేపథ్యంలో సీఎం జగన్ కు చిత్ర పరిశ్రమ తరుపున ధన్యవాదాలు తెలియజేసారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సినీ ప్రముఖులు అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తరువాత తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చర్చకు వచ్చిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా తమ ప్రతిపాదనలన్నింటికీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టుగా మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం జులై 15 నుండి షూటింగులకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఏపీలో కూడా విధి విధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని వెల్లడించారు. అంతేకాకుండా సినీ పరిశ్రమలో సమస్యలతో పాటు టికెటింగ్ విధానంలో మార్పుల గురించి కూడా సీఎంతో చర్చించామని.. మెట్రోపాలిటన్ సిటీస్ అయిన బెంగళూరు, చెన్నై, ముంబై తరహాలో సినిమాను బట్టి టికెట్ రేటు పెంచే విధానం అమల్లోకి తీసుకురావాలని కోరినట్టుగా చిరంజీవి తెలిపారు. థియేటర్స్ మినిమమ్ ఫిక్స్డ్ పవర్ చార్జెస్ ఎత్తివేయాలని సీఎంని కోరగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా సినిమాలకు ఇచ్చే నంది అవార్డుల గురించి మాట్లాడగా 2019-20 సంవత్సరానికి అవార్డులు ఇవ్వడానికి సీఎం సుముఖుత వ్యక్తం చేసారని తెలిపారు. ముఖ్యంగా వైజాగ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారని.. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సినీ ఇండస్ట్రీ కోసం వైజాగ్ ప్రాంతంలో కేటాయించిన 300 పై చిలుకు ఎకరాల భూమిలో ఇండస్ట్రీని అభివృద్ధికి కృషి చేస్తామని చిరంజీవి వెల్లడించారు.
ఏపీ మినిస్టర్ పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఏపీలో సినీ పరిశ్రమకి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ సినీ ప్రముఖులకు హామీ ఇచ్చారని తెలిపారు. చిన్న సినిమాలకి సంభందించి సబ్సిడీలు ఏమైతే ఉన్నాయో సీఎం ఆదేశాల మేరకు ఇవ్వడం జరుగుతుందని.. వైజాగ్ లో స్టూడియోలు నిర్మాణం చేసుకుంటే రాయితీలు అందిస్తామని.. భవిష్యత్ లో సినిమా వారికి ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. అంతేకాకుండా నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని.. జూలై 15 తర్వాత సినిమా షూటింగులు మొదలయ్యేలా విధివిధానాలు రూపొందించామని సీఎం ఆదేశించారని మినిస్టర్ పేర్ని నాని వెల్లడించారు.