కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్న సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ భయం పోయి జనాలు థియేటర్లకు వస్తుండటంతో ఫిలిం మేకర్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మెల్లమెల్లగా టాలీవుడ్ కు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
2022 లో గడిచిన ఈ నాలుగు నెలల్లో తెలుగులో దాదాపు 30 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో కోవిడ్ కారణంగా వాయిదా పడిన భారీ సినిమాలతో పాటుగా.. చిన్న చిత్రాలు మరియు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకాదరణ దక్కించుకొని నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. మిగతావన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ నాలుగు నెలల్లో వచ్చిన సినిమాను ఒక్కసారి పరిశీలిస్తే...
జనవరి నెలలో ఓమిక్రాన్ వేరియంట్ కలవరం సృష్టించడంతో పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చే సాహసం చేయలేదు. దీంతో చిన్న సినిమాన్నీ వరుసగా క్యూ కట్టాయి. 1వ తేదీనన రామ్ గోపాల్ వర్మ 'ఆశా ఎన్ కౌంటర్' మరియు వరుణ్ సందేశ్ 'ఇందువదన' వంటి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండూ ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయనేది కూడా జనాలకు తెలియలేదు. జనవరి 7న వచ్చిన ఆది సాయి కుమార్ 'అతిథి దేవోభవ' - రానా '1947' మరియు 'వేయి శుభములు కలుగు నీకు' వంటి సినిమాలు దారుణమైన ఫలితాన్ని చవిచూశాయి.
సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలవాల్సిన భారీ సినిమాలన్నీ వాయిదా పడటంతో.. 'బంగార్రాజు' వంటి ఒక్క క్రేజీ మూవీ మాత్రమే పోటీలో నిలిచింది. అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున - నాగచైతన్య కలిసి నటించిన ఈ సీక్వెల్ మూవీ పండుగ సీజన్ ని క్యాష్ చేసుకుంది. ఈ క్రమంలో జనవరి నెలలో వచ్చిన ఏకైక బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అదే సీజన్ లో వచ్చిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి'.. దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ 'రౌడీ బాయ్స్'.. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన 'హీరో' సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఈ క్రమంలో 'ఉనికి' 'వధు కట్నం' వంటి చిన్న సినిమాలు వచ్చాయి కానీ.. జనాలు వీటిపై ఆసక్తి కనబరచలేదు. నెలాఖరున కీర్తి సురేష్ నటించిన 'గుడ్ లక్ సఖి' సినిమాని బ్యాడ్ లక్ పలకరించడంతో డిజాస్టర్ తో జనవరి నెలను ముగించింది.
ఫిబ్రవరి నెలలో కరోనా మూడో దశ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కొత్త చిత్రాలు సందడి మొదలైంది. సాధారణంగా ఈ నెలకు సినిమాలకు అన్ సీజన్ గా పేర్కొంటుంటారు. కాకపోతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఏమీ లేకపోవడంతో పలు క్రేజీ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. ఫిబ్రవరి 4న విశాల్ నటించిన 'సామాన్యుడు' అనే డబ్బింగ్ సినిమా విడుదలై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.
11న రవితేజ నటించిన 'ఖిలాడీ' సినిమా పరాజయం పాలైంది. అదే రోజు వచ్చిన విష్ణు విశాల్ 'ఎఫ్ఐఆర్' మరియు 'సెహర్' చిత్రాలు కూడా ఆదరణకు నోచుకోలేదు. 12న రిలీజైన సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' సినిమా మాత్రం థియేటర్లలో నవ్వుకు పూయించింది.. దీంతో నిర్మాతలకు లాభాలు జేబులో వేసుకున్నారు. ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రంగా డీజె టిల్లు నిలిచింది.
తర్వాతి వారంలో మోహన్ బాబు నటించిన 'సన్నాఫ్ ఇండియా' సినిమా థియేటర్లలోకి డిజాస్టర్ గా మిగిలింది. ఫిబ్రవరి 24న వచ్చిన డబ్బింగ్ సినిమాలు అజిత్ 'వలిమై'.. 25న విడుదలైన అలియా భట్ 'గంగూబాయి కాలియావాడి' సినిమాలు నిరాశ పరిచాయి. అయితే అదే రోజు వచ్చిన పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. మొత్తంగా ఫిబ్రవరిలో 'టీజే టిల్లు' బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే.. భీమ్లానాయక్ యావరేజ్ గా నిలిచింది.
మార్చి నాటికి పూర్తిగా కరోనా అదుపులోకి రావడం.. జనాల్లో వైరస్ భయం పోవడంతో చిన్న సినిమాలతో పాటుగా.. భారీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దిగాయి. అయితే మార్చి 4న రిలీజైన కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్ - శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలు సక్సెస్ అందుకోలేకపోయాయి. సూర్య నటించిన 'ఈటీ' సినిమా మార్చి 10న విడుదలై తెలుగులో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' మార్చి 11న భారీ స్థాయిలో విడుదలైంది. అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా.. ఫైనల్ రన్ పూర్తయ్యే సరికి డిజాస్టర్ గా నిలిచింది. 17న వచ్చిన దివంగత కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ 'జేమ్స్' మూవీ తెలుగుతో ఓ మోస్తరు వసూళ్లను అందుకుంది. రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.
మార్చి నెలాఖరున 25వ తేదీన రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా విడుదలయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు 1100 కోట్లకు పైగా వసూళ్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పటికీ కొన్ని ఏరియాలలో ఈ సినిమా నడుస్తోంది.
ఏప్రిల్ నెలలోనూ 'ఆర్.ఆర్.ఆర్' మూవీ జోరు ఏప్రిల్ నెలలోనూ కొనసాగింది. 8న విడుదలైన వరుణ్ తేజ్ 'గని' సినిమా డిజాస్టర్ అయింది. 13న వచ్చిన విజయ్ 'బీస్ట్' సినిమాకు తెలుగులో నిరాశే ఎదురైంది. తర్వాతి రోజు 14న రిలీజ్ అయిన యశ్ 'కేజీఎఫ్ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే 1000 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ కన్నడ మూవీ.. నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఏప్రిల్ 28న విడుదలైన విజయ్ సేతుపతి - సమంత - నయనతార నటించిన 'కణ్మణి రాంబో ఐతీజా' సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 29న మెగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' చిత్రం విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ప్లాప్ గా మిగులుతుందని చెప్పవచ్చు.
ఇలా ఈ నాలుగు నెలల కాలంలో ఐదు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాయి. జనవరిలో 'బంగార్రాజు' హిట్ అయితే.. ఫిబ్రవరిలో 'డీజే టిల్లు' బ్లాక్ బ్లస్టర్ గా.. ‘భీమ్లా నాయక్’ యావరేజ్ గా నిలిచాయి. మార్చిలో RRR.. ఏప్రిల్ లో 'కేజీయఫ్ 2' సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. దీనిని బట్టి ఈ ఏడాది ఇప్పటి వరకు సక్సెస్ రేట్ చాలా తక్కువనే చెప్పాలి. మరి రాబోయే సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి.