టాలీవుడ్ లో రహస్యపార్టీలు సినీ ప్రముఖుల కొంప ముంచుతున్నాయా? పార్టీలు, గెట్ టు గెదర్ పార్టీలకు అలవాటుపడిన సీనీ ప్రముఖులు ఈ కరోనా టైంలోనూ అలాగే పార్టీలు చేసుకుంటున్నారా? తాజాగా సినీ ప్రముఖులకు కరోనా అటాక్ వెనుక ఈ సీక్రెట్ పార్టీలే ఉన్నాయని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విలాసాలకు పోయి సినీ హీరోలు, హీరోయిన్లు, కొందరు దర్శకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా-లాక్ డౌన్ తో సినీ ఇండస్ట్రీ మూతపడి మూడు నెలలు దాటుతోంది. ఈ క్రమంలోనే ఒంటరితనం , పార్టీలపై మోహం వాచిన కొందరు సినీ సెలబ్రెటీలు ఏమాత్రం జాగ్రత్తలు పాటించకుండా సీక్రెట్ గా పార్టీలు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వారందరికీ కరోనా సోకి ఆస్పత్రుల పాలవుతున్నారని తెలుస్తోంది. కొంతమంది సెలబ్రిటీల అజాగ్రత్త వల్ల ఇప్పుడు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ భారీగా ఖర్చు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.. వారి రహస్య పార్టీల్లో తగిన రక్షణ పాటించకపోవడంతో ఈ వైరస్ వ్యాపిస్తున్నట్టు తెలిసింది.
ఫిల్మ్ నగర్ నుంచి చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. నలుగురు సినీ ప్రముఖులకు కరోనావైరస్ సోకినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారంతా హోం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిసింది. పరిశ్రమలో కొందరు పెద్ద హీరోలతో నటించినప్పటికీ తనదైన ముద్ర వేయడానికి కష్టపడుతున్న ఒక హీరోయిన్.. ప్రస్తుతం కరోనా సోకిన మొదటి హీరోయిన్ గా చెబుతున్నారు. ఒక పార్టీకి హాజరైన తరువాత.. ఆమె దగ్గు.. గొంతునొప్పితో సహా లక్షణాలు వచ్చినట్టు సమాచారం. చికిత్స తీసుకున్న 10 రోజుల తరువాత ఆమెకు నెగెటివ్ వచ్చినట్టు తెలిసింది. కరోనా నుంచి ఆమె బయటపడినట్టు తెలిసింది.
మరొక ప్రసిద్ధ దర్శకుడు ఇటీవల రెండు ఫ్లాప్ లు ఇచ్చాడు.ఇతడు కూడా అదే రహస్య పార్టీకి హాజరయ్యాడని.. మరొక జూనియర్ హీరోతో కలిసి పార్టీ చేసుకున్నాడని ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని తెలిసింది.. దర్శకుడు ఇంట్లో కోలుకోగా, కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిన తరువాత హీరో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. సినీ పరిశ్రమలో కొందరు ప్రముఖ హీరోలతో పనిచేసే మరొక నిర్మాతకు కూడా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం కోలుకున్నట్టు సమాచారం.
ఈ సెలబ్రిటీలకు సీక్రెట్ పార్టీల వల్లే కరోనా రావడంతో ఇప్పుడు మరికొందరు సినీ ప్రముఖులు పార్టీలకు వెళ్లడానికి భయపడి ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. కరోనా టైంలో ఇలాంటి పార్టీలు, గెట్ టు గెదర్, సీక్రెట్ పార్టీలకు దూరంగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నా ఎవ్వరూ వినని పరిస్థితి నెలకొంది.