తెలంగాణ ఎన్నికల సమరానికి వేళయ్యింది. డిసెంబర్ 7న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలుస్తుందా.? లేక మహాకూటమి జయకేతనం ఎగురవేస్తుందా అన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. కాగా పోలింగ్ శాతం ఈసారి పెరిగే అవకాశం కనపడుతోంది. ఎన్నికల కమిషన్ అవగాహన పెంచడంతోపాటు స్టార్స్ కూడా ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సినీ తారలు ఉండే జూబ్లిహిల్స్ - బంజారా హిల్స్ లో మన టాలీవుడ్ తారలు ఎందరు ఓటు హక్కు వినియోగించుకుంటారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.. డిసెంబర్ 7న సినీ తారల్లో కొందరు షూటింగ్ బిజీల్లో ఉన్నా కొందరైనా వినియోగించుకునే అవకాశాలున్నాయి. సినీ తారలు వస్తే పోలింగ్ కేంద్రాలు కొత్త కళ సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా జూబ్లిహిల్స్ లో ఉండే జూనియర్ ఎన్టీఆర్ - రాంచరణ్ తేజ్ - రానా - వెంకటేశ్ - నాగార్జున - అక్కినేని అమల - అఖిల్ - నాగచైతన్య - చిరంజీవి - నాగబాబు - మహేష్ బాబు - అల్లరి నరేష్ - అర్యన్ రాజేశ్ - కోట శ్రీనివాస్ రావు - కైకాల సత్యనారాయణ - శివాజీ రాజా - సీనియర్ నరేష్ తదితర సినీ ప్రముఖులంతా ప్రతిసారి ఓటు వేసేవారే.. ఈసారి కూడా వీరు వస్తే ఎన్నికల్లో కొత్త శోభ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక స్టార్సే కాదు.. వారి సతీమణులు కూడా ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రెడీ అయ్యారు. ఇందులో ముఖ్యంగా రాంచరణ్ సతీమణీ ఉపాసన - మహేష్ భార్య నమ్రత కూడా జూబ్లిహిల్స్ లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. వారి భర్తలు రాకున్నా.. వీరు ఖచ్చితంగా ఓటు వేసే అవకాశాలైతే ఉన్నాయి. రాంచరణ్ ఎంత బిజీగా ఉన్నా ఓటు హక్కు వేయడాన్ని మాత్రం మరిచిపోరు.ఈసారి ఏం చేస్తారో చూడాల్సిందే..
ఇక సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా ఓటు వేస్తారు. ఇక టాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం ఈసారి ఓటు వేసే అవకాశాలున్నాయి. రాజమౌళి నుంచి మొదలు పెడితే పూరి - శ్రీను వైట్ల - దాకా అందరూ వేసే అవకాశం ఉంది. కమెడియన్లు - దర్శకులు - సీనియర్ తారలు - రచయితలు - సంగీత దర్శకులు ఇలా మొత్తం జూబ్లిహిల్స్ - బంజారా హిల్స్ పోలింగ్ కేంద్రాలు డిసెంబర్ 7న కళకళలాడడం ఖాయంగా కనిపిస్తోంది. వీరంతా ఓటు హక్కు వినియోగించుకుంటేనే ఇదంతా.. లేదంటే అందరూ నిట్టూర్చాల్సిందే.. మరి తారలు స్పందిస్తారో లేదో చూడాలి మరి..