టాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రగ్స్ కేసులో నోటీసులు ఇవ్వడం.. పెను సంచలనం అయింది. జూలై నెలలో ఓ 15 రోజుల పాటు ఇదే హంగామా నడిచింది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం నోటీసుల సంగతేమో కానీ.. ఈ విషయానికి మీడియా ప్రచారం కల్పించిన తీరు మాత్రం విమర్శలకు గురయింది. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ తమ ఉనికి చాటుకోవడానికి సినిమా రంగాన్ని ట్రైలర్ లా ఉపయోగించుకుంటోందంటూ.. రామ్ గోపాల్ వర్మ సైతం వ్యాఖ్యలు చేశాడు.
అయితే.. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకుని.. విచారణకు హాజరైన వారు ఇప్పుడు ఊరట చెందినట్లుగా కనిపిస్తోంది. "నాకు నోటీసు వచ్చినపుడు నవ్వు వచ్చింది. నేను చాలా క్లీన్. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనలేదు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను" అంటున్నాడు దర్శకుడు పూరీ జగన్నాధ్. "నాకు నోటీసు వచ్చినపుడు షాక్ అనిపించింది. ఇలాంటి ఇలాంటి వాటితో ఎలాంటి సంబంధం లేదు. అందుకే ఎక్కువగా ఆలోచించకుండా అధికారులకు సహకరించాను. ఒక క్లారిటీ కోసమే వారు పిలిచారు. ప్రస్తుతం ఆ కేసు స్టేటస్ ఏంటో నాకు తెలియదు" అన్నాడు సుబ్బరాజు.
హీరోయిన్ ఛార్మి అయితే ఈకేసును అసలు పట్టించుకున్నట్లుగానే కనిపించలేదు. పైసా వసూల్ మూవీ రిలీజ్ ను 4 వారాలు ప్రీపోన్ చేయడంతో.. ఆ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీగా ఛార్మీ ఉండిపోయింది. అయితే.. ఈ కేసులో ఛార్మి పేరు వినిపించంతో.. ఆమె తల్లి ఆరోగ్యం దెబ్బ తినడం.. మొదట్లో ఛార్మిపై కొంత ప్రభావం చూపిందని సన్నిహితులు చెబుతున్నారు. యాక్టర్ నందు ఈ కేసు విషయంలో మొదట కొంత ఎక్కువగా స్పందించాడు. "అధికారులతో మాట్లాడిన రిలీఫ్ లభించింది. వారు ఎంతో గౌరవపూర్వకంగానే ప్రవర్తించారు. ఈ విషయంలో క్లారిఫికేషన్ కోసమే నన్ను పిలిచారు" అని చెప్పాడు నందు.
సెలబ్రిటీల రియాక్షన్ చూస్తుంటే.. కేసు విషయాన్ని పక్కన పెట్టేసి వారి వారి పనుల్లో బిజీ అయిపోయారు. మరి ఇదే పనిలో ఉన్న సిట్ అధికారులు సైలెంట్ అయిపోవడానికి కారణాలు ఏంటో మాత్రం తెలియలేదు.