పవన్‌ జానీ నుండి లైగర్‌ వరకు.. ఆ కాన్సెప్ట్‌ సినిమాలన్నీ ఫ్లాప్‌

Update: 2022-08-27 02:30 GMT
భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్‌' సినిమా ఆశించిన స్తాయిలో ఆకట్టుకోలేదు అంటూ రివ్యూలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా నెగిటివ్ గానే స్పందిస్తున్నారు. విజయ్ దేవరకొండ ను ఫైటర్ గా చూపడం బాగానే ఉంది కానీ ఆయనను నత్తి వాడిగా చూపించడమే బాగా లేదు అని.. మైక్ టైసన్ ను జోకర్ గా చూపించడం కూడా విడ్డూరంగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి.

ఈ సమయంలోనే టాలీవుడ్ లో గతంలో వచ్చిన ఫైటర్ కాన్సెప్ట్‌ సినిమా ల గురించి చర్చ జరుగుతోంది. ఎక్కువ శాతం జనాలకు మొదటి ఫైటర్ సినిమా ఏది అంటే పవన్‌ కళ్యాణ్ నటించిన తమ్ముడు అంటారు. అంతకు ముందు వచ్చినా కూడా మెయిన్ కాన్సెప్ట్‌ తో వచ్చింది మాత్రం తమ్ముడు సినిమానే. అందుకే తమ్ముడు సినిమా మొదటి ఫైటర్‌ కాన్సెప్ట్‌ తో వచ్చిన సినిమా గా చెప్పుకోవచ్చు.

తమ్ముడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా కూడా బాక్సింగ్‌.. ఫైటింగ్‌ నేపథ్యంలో రూపొందిందే. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక పవన్ నటించిన జానీ సినిమా కూడా ఫైటర్‌ మరియు బాక్సింగ్ నేపథ్యంలోనే వచ్చింది అనే విషయం తెల్సిందే.

జానీ ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అట్టర్ ఫ్లాప్ సినిమా గా జానీ నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ఫైటింగ్ కాన్సెప్ట్‌ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. నవదీప్ నటించిన జై సినిమా లో కూడా ఫైటర్‌ సన్నివేశాలు ఉంటాయి. ఆ సినిమా కూడా ఫ్లాప్ గానే నిలిచింది. ఇక వెంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన గురు సినిమా కూడా బాక్సింగ్‌ నేపథ్యం.

గురు కూడా ఆశించిన స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకోలేదు. ఇటీవల గని సినిమా కూడా బాక్సింగ్‌ నేపథ్యంలోనే వచ్చింది. ఆ సినిమా ఫలితం ఏంటో తెల్సిందే. మళ్లీ తక్కువ సమయం గ్యాప్‌ లోనే ఫైటర్ బాక్సింగ్ కాన్సెప్ట్‌ తో వచ్చిన సినిమా లైగర్. ఈ సినిమా ఫలితం కూడా తేడా కొట్టింది.

ముందు ముందు బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ అంటే ఫిల్మ్‌ మేకర్స్ బయపడే పరిస్థితి వచ్చింది. జానీ నుండి మొదలుకుని లైగర్ వరకు బాక్సింగ్ కాన్సెప్ట్‌ సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో ముందు ముందు ఆ కాన్సెప్ట్‌ తో సినిమాలు వచ్చేది అనుమానమే.
Tags:    

Similar News