కథలు మార్చే టైమ్‌ వచ్చేసింది

Update: 2015-10-23 04:02 GMT
ఈ మధ్య కాలంలో రెండు సినిమాలు ఇచ్చిన పంచ్‌ ఒకలా ఉంటే.. మరో రెండు సినిమాలు ఇచ్చిన పంచ్‌ మరోలా ఉంది. అందులో ఒకటి రామ్‌ హీరోగా వచ్చిన శివమ్‌ అయితే.. మరొకటి రామ్‌ చరణ్‌ హీరోగా వచ్చిన బ్రూస్‌ లీ సినిమా. ఇప్పుడు రుద్రమదేవి.. కంచె.. వంటి సినిమాల రాకతో ఈ సినిమాల తాలూకు ప్రభావం కాస్త గట్టిగానే పడుతోంది.

మ్యాటర్‌ ఏంటంటే.. రొటీన్‌ కథతో వచ్చిన శివం ఇనిమా తొలినాడే అట్టర్‌ ఫ్లాప్‌ అయిపోగా.. అదే రొటీన్‌ కథతో వచ్చిన బ్రూస్‌ లీ మాత్రం రామ్‌ చరణ్‌ మెగా ఇమేజ్‌ కారణంగా కొద్దోగొప్పో నడుస్తోంది. అయితే ఇప్పుడు రుద్రమదేవి.. కంచె.. వంటి సినిమాలో ఏకంగా తెలుగులో ఉన్న హిస్టరీని.. ఆ పాత చరిత్రను తవ్వి తీసిన జ్ఞాపకాలనూ టచ్‌ చేస్తూ.. ఓ రేంజులో ఇంప్రెస్‌ చేశాయి. ఈ సినిమాలకు సక్సెస్‌ రేంజ్‌.. డబ్బులు వస్తాయా అంటారా??? అదంతా కూడా మన దర్శకులకు ముందే ఉండాలి. ఒకవేళ రుద్రమను బడ్జెట్‌ కంట్రోల్‌ లో తీసి.. బాగా ప్రమోట్‌ చేసుంటే.. డబ్బులు వచ్చేసేయే.. అలాగే కంచె ను కూడా ఇంకాస్త టైట్‌ గా తీసుంటే కలెక్షన్లు బీభత్సంగా పండే ఛాన్సుండేది.

కాకపోతే ఈ కథల కారణం.. శివం.. బ్రూస్‌ లీ వంటి కథలను ఇక ఆపేయాలి అనే సంకేతాలు వచ్చేసినట్లే.
Tags:    

Similar News