మన హీరోలకు ఏం ఈగో గురూ!!

Update: 2017-06-18 09:16 GMT
బాలీవుడ్లో ఫిలింఫేర్ అవార్డులు కార్యక్రమం జరుగుతోంది అనుకోండి.. అక్కడకు అనేకమంది స్టార్లు వస్తారు. ఖచ్చితంగా సల్మాన్ ఖాన్.. షారూఖ్‌ ఖాన్.. అక్షయ్ కుమార్ లలో ఒక ఇద్దరు మాత్రం అక్కడ కనిపిస్తారు. వారి తరువాత రేంజ్ స్టార్లయిన రణబీర్ కపూర్.. రణవీర్ సింగ్.. షాహిద్ కపూర్.. అర్జున్ కపూర్.. సిద్దార్ద్ మల్హోత్రా.. అయుష్మాన్ ఖురానా.. సుశాంత్ సింగ్ తదితరులు హాజరు వేయించేసుకుంటారు. ఇతర స్టార్లయిన ఫరాన్ అక్తర్.. ఇర్ఫాన్ ఖాన్.. నవాజుద్దీన్ సిద్దికీ వంటి ప్రామినెంట్ నటులు కూడా వచ్చేస్తారు. హీరోయిన్లు కూడా దాదాపు అందరూ కనిపిస్తారు. కాని తెలుగులో ఈ అవార్డుల కార్యక్రమం జరిగితే మాత్రం.. అసలు ఈ ఈవెంటుకు ఉండాల్సిన సదరు ఎంటర్టయిన్మెంట్ కోషెంటే మిస్సయిపోతుంది.

గత రాత్రి ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఆల్రెడీ తామే విజేతలమని తెలుసనుకుంట.. అందుకే జూ.ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ కార్యక్రమానికి విచ్చేశారు. ఇకపోతే మహేష్‌ బాబు.. రామ్ చరణ్‌.. ప్రభాస్.. వంటి సూపర్ స్టార్లు కనీసం రానుకూడా రాలేదు. ఆ తరువాత రేంజ్ హీరోలైన నాని.. నితిన్.. రామ్.. నిఖిల్ మొదలగు హీరోలు కూడా ఎక్కడా కనిపించలేదు. స్టార్ కిడ్స్ అయిన రానా అండ్ నాగ చైతన్య కూడా మిస్సింగే. ఇతర హీరోలైన నారా రోహిత్.. నాగ శౌర్య.. తదితరులు కూడా డుమ్మా కొట్టేశారు. అందరూ చెప్పే సింగిల్ రీజన్.. ''షూటింగులో బిజీగా ఉండటం వలన రాలేకపోయాం''. కాని ఇందులో వాస్తవం ఏంటో అందరికీ తెలుసు. ఇక గతేడాది ఇలాంటి అవార్డుల కార్యక్రమాల్లో తెగ హడావుడి చేసిన సీనియర్ హీరోలు.. చిరంజీవి.. బాలయ్య.. నాగ్.. వెంకీలు కూడా ఈసారి కనిపించలేదు. ఈ ఫిలింఫేర్ అవార్డులను చూస్తుంటే.. అదేదో గవర్నమెంట్ ఇచ్చే అవార్డులను స్వీకరించడానికి కేవలం విజేతలే విచ్చేసినట్లుంది.

చాలాసార్లు చాలా అవార్డ్స్ కార్యక్రమాల్లో.. కేవలం అవార్డులు వచ్చిన హీరోలే కనిపించారు కాని.. ఎప్పుడూ కూడా అవార్డు రాకపోయినా కూడా అక్కడకు వచ్చిన స్టార్ హీరోలను మనం చూడలేదు. మనోళ్ళకి పైసల్ తీసుకుని కాల్ షీట్లు ఇచ్చి ఇచ్చీ ఇప్పుడు ఫ్రీగా అవార్డు షో కోసం రావాలంటే కాస్త కష్టంగానే ఉన్నట్లుంది. కాని స్టార్ హీరోయిన్లను మాత్రం మెచ్చుకోవాలి. అవార్డు వచ్చినా రాకపోయినా.. సమంతతో పాటే రకుల్.. లవాణ్య త్రిపాఠి.. రాశి ఖన్నా.. రెజీనా.. ప్రగ్యా జైస్వాల్ లు అక్కడ సందడి చేశారు. అంటే వీళ్ళలో చాలామందికి డ్యాన్సింగ్ కాంట్రాక్టు ఇచ్చారులే.. అందుకే వీళ్లు కూడా వచ్చుండచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా కూడా మనోళ్లు ఈ రేంజు ఈగోయిస్టులు అయితే కష్టమే గురూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News