ఎంతైనా మన హీరోల టేస్టే వేరండీ. ఒకరికి గట్టంటే ఇష్టం - మరొకరికి చెట్టంటే ఇష్టం. ఒకరు ఇంట్లో తనతో పాటు తన బైకూ ఉండాలంటారు - మరొకరు జిమ్ముంటేనే ఇల్లంటారు. ఎంతైనా హీరోలు కదా... ఆ అభిరుచులకి తగ్గట్టుగానే అన్నీ సమకూరిపోతుంటాయి. టాలీవుడ్ లోని కొంతమంది హీరోలు కూడా వాళ్ల వాళ్ల టేస్టులకి తగ్గట్టుగానే ఇళ్లు - ఆఫీసుల్ని సిద్ధం చేసుకొన్నారు. అయితే ఆ టేస్టులు మాత్రం అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే యువ కథానాయకుడు నానికి గట్లంటే ఇష్టమట. తన అమ్మమ్మ ఊళ్లో గట్లు తనని బాగా ఆకట్టుకొనేవట. అందుకే తన ఆఫీసులో అలాంటి గట్లే కట్టుకొన్నాడు. వాటిపైనే కూర్చుని, వాటిపైనే పడుకొంటుంటాడట నాని. ఇక గోపీచంద్ కి చెట్లంటే ఇష్టమట. అందుకే తన ఇంట్లో ఎక్కడ చూసినా చెట్లే కనిపించేలా ఏర్పాట్లు చేసుకున్నాడట. ఇక నాగచైతన్య అయితే తనతో పాటే తన లివింగ్ రూమ్ లో బైక్ ఉండేలా చూసుకొంటాడట. అందుకే ఫ్లాట్లో ఉన్నా సరే - బైక్ మాత్రం పైకి వెళ్లాల్సిందేనట. అల్లు అర్జున్ అయితే చుట్టూ వరిపొలం మధ్య తన ఫామ్ హౌస్ కట్టుకొన్నాడట. శర్వానంద్ ది ఇరుకిల్లట. అలా ఉండటం నాకు ఇష్టమని, అంత ఇరుకిల్లైనా మా ఇంట్లో జిమ్ము కూడా ఉంటుందని చెబుతున్నాడాయన.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/