మొన్నామధ్యన మహేష్ బాబును ఒక క్వశ్చన్ అడిగారు.. గురువు గారూ మల్టీస్టారర్లు చేస్తారా అని.. మనోడు వెంటనే ఎస్ అన్నాడు. తరువాత ఇదే మాటను బన్నీని అడిగారు. అతను కూడా ఎస్ అన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా చేస్తానన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే మాటను చెప్పాడు. అయితే నిజంగా ఎంతవరకు ఈ మల్టీస్టారర్లు మెటీరియలైజ్ అవుతున్నాయి?
నిజానికి చాలా సినిమాలను దర్శకులు ప్రపోజ్ చేసినా కూడా.. సరైన స్ర్కీన్ టైమ్ లేదనో లేకపోతే తన క్యారెక్టర్ గ్రాఫ్ గొప్పగా లేదనో.. మన స్టార్ హీరోలు వాటిని రిజక్టు చేస్తున్నారు అనే టాక్ ఉంది. ఆ మధ్యన చంద్రశేఖర్ ఏలేటి 'మనమంతా' సినిమాలో తెలుగు స్టార్ ను ఎందుకు తీసుకోలేదు అంటే.. ఈ తక్కువ స్ర్కీన్ టైమ్ చూసి ఎవరైనా చేస్తారా చెప్పండి అంటూ రివర్సు క్వశ్చన్ వేశారు. దానిబట్టి చూస్తుంటే.. హీరోలందరూ నేను రెడీయే రెడీయే అంటున్నారు కాని.. కథలు మాత్రం దొరక్కట్లేదన్నమాట. ఒకవేళ కథలు దొరికినా కూడా వీళ్లకు అవి నచ్చట్లేదనమాట.
ఇదే మాటను దర్శకుల దగ్గర ప్రస్తావిస్తే.. మల్టీస్టారర్ సినిమాలంటే పూర్వం అన్నదమ్ముల అనుబంధం టైపులో ఉండేవి. ఇప్పుడు అలాంటి సినిమాలు ఆడట్లేదు. పైగా చాలామంది స్టార్లు కేవలం వారి ఫ్యామిలీకి చెందిన హీరోలతోనే మల్టీ స్టారర్లు చేస్తున్నారు కాని.. ఇతర హీరోలతో చేయట్లేదు అంటూ చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే టాలీవుడ్ లో మల్టీ స్టారర్లు రావడం కష్టమే గురూ!!