ఇల్లు అమ్మేసుకున్న హీరోయిన్

Update: 2017-04-16 17:30 GMT
ఆమె ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. అప్పటి స్టార్ హీరోలు చాలామందితో ఆడిపాడింది. బాల నటిగా కెరీర్ ఆరంభించిన ఆమె హీరోయిన్ గా కూడా చాలా ఏళ్ల పాటు హవా సాగించింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో ఆమె కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది. ఆ తర్వాత సడెన్ గా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడింది. కెరీర్లో మంచి స్వింగులో ఉన్న టైంలో సంపాదించిన డబ్బులతో పెద్ద ఇల్లు కొనుగోలు చేసిందామె. ఐతే ఇప్పుడు ఆమె ఆ ఇంటిని అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లు సమాచారం.

తన పెద్ద ఇంటిని అమ్మేసి.. చిన్న ఇంటిలోకి మారిందట ఆమె. ఇదంతా తన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా కోసమేనట. ఇంటితో పాటు మరికొన్ని ప్రాపర్టీస్ ను కూడా అమ్మేసిందట. సినిమాల నుంచి దూరమయ్యాక ఈ నటి ఓ ప్రి స్కూల్ నడపగా.. అది ఆమెకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ నటి ఇంతకుముందు తన భర్త కోసం కూడా ఓ సినిమా నిర్మించింది. అది కూడా ఆమెను దెబ్బ తీసింది. ఇప్పుడు తన ప్రొడక్షన్లో రాబోతున్న సినిమా మీదే ఆమె ఆశలన్నీ నిలిచి ఉన్నాయి. ఆమె నటిగా కూడా రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఒకట్రెండు సినిమాల్లో నటించింది. ఇప్పుడామె నటించిన ఓ హార్రర్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇంకో రెండు మూడు అవకాశాలు ఆమె చేతిలో ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News