హీరోయిన్లను ఫ్రీగా ఎప్పుడొచ్చారు కనుక

Update: 2016-07-02 09:44 GMT
అమెరికాలో జరుగుతున్న ఒక తెలుగు అసోసియేషన్‌ వార్షికోత్సవాలకు తాము అటెండ్‌ కావట్లేదని సెక్సిణి సమంత.. అలాగే మిల్కీ బ్యూటి తమన్నా కూడా అఫీషియల్‌ గా ట్వీట్లు వేసి మరీ చెప్పుకొచ్చారు. అయితే మొన్నటివరకూ వస్తామని లాస్టు మినిట్‌ ఎందుకు హ్యాండిచ్చినట్లు? అంతే కాకుండా.. ఈ కార్యక్రమానికి వస్తుంటే తమను ఆర్గనైజనర్ ఒకరు దూషిస్తున్నారని.. సంపూర్ణేష్‌ బాబు - అనసూయ వంటి వారు చెప్పడం గమనార్హం.

ఇకపోతే అసోసియేషన్‌ వారు మాత్రం.. సమంత అండ్‌ తమన్నా షుమారు 30 లక్షలు అడిగారని.. అది మేం ఇవ్వలేకపోయామని.. అందుకే వారు రావట్లేదని.. మరీ అంతేసి డబ్బులు డిమాండ్ చేయకూడదని చెబుతున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌ లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఏదో అమెరికా మీద ప్రేమతోనో.. లేకపోతే అక్కడకు వెళితే మనకు కాస్త పుణ్యం పురుషార్దం దక్కుతాయనో ఏ ఒక్క హీరోయిన్ కూడా ఈ అసోసియేషన్లు పిలవగానే వచ్చేయట్లేదు. ఏదో నాలుగు డబ్బులు వస్తాయి.. అలాగే వీళ్ల ఖర్చులతో చక్కగా ఓ వారం అమెరికా చూసి రావచ్చు అనే అందరూ అక్కడి వెళుతున్నారు. అలాంటప్పుడు డబ్బులు ఎక్కువ డిమాండ్‌ చేస్తున్నారు అంటే ఎలా? అసలు వీరు ఫ్రీగా ఎప్పుడొచ్చారని.

అలాగని ఫ్రీగా వచ్చే హీరోయిన్లు కూడా ఉంటారు కాని.. వారిని ప్రతీ సంవత్సరం పిలుస్తారా ఏంటి? అయినా తెలుగు అసోసియేషన్ల ఈవెంట్స్ అంటే.. తెలుగింట పుట్టిన తెలుగు హీరోయిన్లను పిలవాలి కాని.. అసలు ఇంతలేసి డబ్బులిచ్చి ఈ పక్క రాష్ట్రాల స్టార్‌ హీరోయిన్లను ఎందుకు పిలుస్తున్నారు బాసూ అని అడిగేవారూ లేకపోలేదు.
Tags:    

Similar News