హైద్రాబాద్ పై హీరోయిన్ల ప్రేమ

Update: 2016-09-23 19:30 GMT
ప్రతీ శుక్రవారం టాలీవుడ్ లో ఓ కొత్త హీరోయిన్ దిగుతుంది.. అంటూ రీసెంట్ గా రెజీనా ఓ కామెంట్ చేసింది. తెలుగు ఆడియన్స్ ను చిన్నబుచ్చే యాంగిల్ లో రెజీనా ఈ కామెంట్ చేసినా.. ఇందులో వాస్తవం అయితే ఉంది. అయితే.. కొంతమంది భామలు మాత్రమే.. హైద్రాబాద్ కు వచ్చిపోవడం అనే యాంగిల్ లో కాకుండా.. ఇక్కడ సొంతిల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. హైద్రాబాద్ ని తమ సొంతూరిగా మార్చేసుకుంటున్నారు.

కొన్ని నెలల క్రితం హైద్రాబాద్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఇల్లు కొనుక్కుందనే వార్త బాగా హాట్ టాపిక్ అయింది. నిజానికి ఇక్కడే ఓ హౌస్ ను ఏర్పాటు చేసుకోవడం అనే కల్చర్.. స్వీటీ అనుష్కతో స్టార్ట్ కాగా.. ఆ తర్వాత చాలామంది ఫాలో అయిపోయారు. రకుల్ కంటే ముందే.. ఇక్కడ ఛార్మీకి కూడా సొంతిల్లు ఉంది. రాశి ఖన్నా కూడా హైద్రాబాద్ లో సెటిల్ అయిపోయేందుకు వీలుగా ఇల్లు ఏర్పాటు చేసేసుకుంది. కొన్నేళ్ల క్రితమే ఇక్కడ ఓ గూడు ఏర్పాటు చేసుకున్న సమంతకి అయితే.. చైతుతో పెళ్లి జరిగాక ఏకంగా అత్తవారింటి ఊరుగా హైద్రాబాద్ మారిపోనుంది. రీసెంట్ గా ఈ జాబితాలో లావణ్య త్రిపాఠి కూడా చేరిపోయింది.

దేశంలోని వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఈ భామలంతా హైద్రాబాద్ లో సెటిల్ అయేందుకు నిర్ణయించుకోవడం ప్రశంసించాల్సిన విషయమే. ఇక్కడో విషయం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడే ఉంటూ.. ఇక్కడ సెటిల్ అయిన భామలకు.. నిర్మాతలు బోలెడన్ని ఆఫర్స్ ఇస్తున్నారు కూడా. కెరీర్ లో పైకి రావడం విషయంలో.. హైద్రాబాద్ లో సెటిల్ కావడం కూడా ముఖ్యమన్న మాట.
Tags:    

Similar News