జగన్ కి టాలీవుడ్ సన్మానం... ఎపుడంటే....?

Update: 2022-03-10 09:17 GMT
జగన్ రాజకీయాల్లో ఉన్నారు. అయినా టాలీవుడ్ మీద ఆయన ఫోకస్ పెట్టే ఉంచారు. ఆ విషయం టికెట్ల రగడ ద్వారా అందరికీ అర్ధమైపోయింది. జగన్ కి కావాల్సింది టాలీవుడ్ ని తన వైపుగా తిప్పుకోవడం. ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారనే అనుకోవాలి. టికెట్ల ధరలు తగ్గించి చర్చల పేరిట అనేక దఫాలు సినీ ప్రముఖులతో ప్రభుత్వం భేటీలు వేసింది. చివరికి టాలీవుడ్ పెద్దల కోరిక మేరకు అంటూ వయా మీడియాగా టికెట్ల రేట్లను పెంచుతూనే ఏపీలో కూడా షూటింగులు ఇరవై శాతం జరపాలని షరతు పెట్టింది.

సరే టాలీవుడ్ ప్రముఖులు కోరినట్లుగా జీవో అయితే వచ్చింది. దాంతో ఎవరి మటుకు వారు వ్యక్తిగతంగా జగన్ కి థాంక్స్ చెబుతూ వస్తున్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగదని అంటున్నారు. జగన్ మనసెరిగిన కొందరు సినీ పెద్దలు ఆయనకు ఘన సన్మానం చేయాలని ప్రతిపాదించారని తెలుస్తోంది. అయితే అది ఎపుడు జరుగుతుంది, వేదిక ఎక్కడ, డేట్, టైమ్ ఇవన్నీ ప్రస్తుతానికి తేలకపోయినా స్థూలంగా అంతా అనుకుంటున్న మాట అయితే తమకు ఇంత మేలు చేసిన సీఎం కి సన్మానం చేయాలన్నది ఒక ప్రతిపాదనగా ఉంది.

నిజానికి జగన్ కి సన్మానం చేయాలన్నది మా కి కొత్త ప్రెసిడెంట్ గా మంచు విష్ణు ఎన్నికైన వెంటనే వినిపించింది. మా ఆద్వర్యంలో ఈ కార్యక్రమం ఉంటుంది అని అనుకున్నారు. ఈ లోగా టికెట్ల రగడ ఒక రేంజిలో పెరగడంతో ఆ ఇష్యూ అలా ఉండిపోయింది. ఇపుడు సమస్య తీరింది కాబట్టి సన్మానం అని అంటున్నారు. అయితే ఈసారి ప్రతిపాదన మాత్రం మా  వైపు నుంచి కాదు టోటల్ సినీ ఇండస్ట్రీ వైపు నుంచే అని తెలియవస్తోంది.

ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి మరోమారు జగన్ని కలుస్తారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. ఆయన సినీ బిడ్డగానే ముఖ్యమంత్రితో భేటీ వేస్తారు అని అంటున్నారు. ఆయన‌తో పాటుగా సినీ ప్రముఖులు కూడా కొందరు ఈ భేటీలో  ఉంటారని అంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ టికెట్ల రేట్లను పెంచుతూ ప్రభుత్వం జీవో ఇవ్వడం మీద ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉండగా సీఎం కి సన్మానం అన్న ప్రతిపాదన మీద జరుగుతున్న ప్రచారం తో జనసేన ఘాటుగానే  రియాక్ట్ అయింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అయితే ఎందుకు సన్మానం చేయాల్ని పాయింట్ రైజ్ చేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తీరును సినీ పరిశ్రమ తప్పుపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తమ విషయంలోనే వైసీపీ ప్రభుత్వం ఇలా వ్యవహరించిందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటనే విషయాన్ని సినీ పెద్దలు ఆలోచించాలని కూడా ఆయన సూచించారు.

ఇక జగన్ కు సన్మానం చేయడానికి సినీ పరిశ్రమ సిద్ధంగా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన‌ అన్నారు. మొత్తానికి సినీ పరిశ్రమ జగన్ కి సన్మానం అన్న మాట వింటేనే జనసేన గట్టిగా రియాక్ట్ అవుతోంది. నిజంగా  సన్మానం చేసి జగన్ ని పొగిడితే అపుడు  పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News