కరోనా క్రైసిస్ నేపథ్యంలో సినీపరిశ్రమ సమస్యలపైనా.. అలాగే ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్టు రేట్ల సమస్యలపై చర్చించేందుకు ఇటీవలే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలోని సినీపెద్దలకు ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. మంత్రి పేర్ని నాని నేరుగా చిరుకి ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో సీఎంకి విన్నవించాల్సిన అన్ని విషయాలపైనా కూలంకుశంగా చర్చించి వెళ్లాలన్న ఉద్ధేశంతో ఇండస్ట్రీ మీటింగ్ నేడు హైదరాబాద్ లో జరిగింది.
ఫిలిం చాంబర్ అధ్యక్షులు నారాయణ దాస్ ఆధ్వర్యంలో నిర్మాతల సంఘం.. పంపిణీ ఎగ్జిబిషన్ రంగాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల ఏపీలో వచ్చిన జీవోలో ఉన్నవాటిపై చర్చించారు. సీఎంతో సమస్యల పరిష్కారానికి మార్గాలేమిటి? అన్నదానిపై చర్చించారు. అన్నిటికీ డెడ్ లైన్స్ పెట్టుకుని పరిష్కరించాలన్నది ప్రధాన డిమాండ్. చిన్న నిర్మాతల సమస్యలపైనా సీఎంతో భేటీలో చర్చించనున్నారు.
ముఖ్యంగా ఈ భేటీలో టిక్కెట్టు రేట్లపై చర్చించనున్నారు. గ్రామ పంచాయితీ- నగర పంచాయితీ- కార్పొరేషన్ ఏరియాల్లో టిక్కెట్టు ధరలపై ఏం అడగాలి? అన్నదానిపైనా కమిటీని నియమించారు. దర్శకనటుడు నిర్మాత ఆర్.నారాయణ మూర్తి ఇతర చిన్న నిర్మాతల డిమాండ్ మేరకు ఐదో షోని చిన్న సినిమాకి కేటాయించాల్సిందిగా సీఎంని కోరనున్నారు.