మూడు బ్లాక్ బస్టర్ లు... ఆరు సూపర్ హిట్లుగా సాగాల్సిన తెలుగు సినిమా ఈ ఏడాది ప్రథమార్ధంలో నానా కష్టాలు పడ్డ సంగతి తెలిసిందే. చెప్పుకోవడానికి ఒకే ఒక్క బ్లాక్ బస్టర్. అది కూడా మరీ భారీ సినిమా ఏమీ కాదు. కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్’. ఇది కాకుండా భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఒక్క స్టార్ సినిమా కూడా లేదు. టెంపర్, గోపాల గోపాల, సన్నాఫ్ సత్యమూర్తి వసూళ్లయితే తెచ్చాయి కానీ.. పెద్దగా లాభాలు మాత్రం కళ్లజూడలేదు. హిట్లు లేకపోవడమే కాదు.. వేసవికి వస్తాయనుకున్న చాలా పెద్ద సినిమాలు వాయిదా పడి.. ప్రథమార్ధం వెలవెలబోయింది. భారీ అంచనాలు పెట్టుకున్న చాలా సినిమాల్లో ఫస్టాఫ్ నిరాశ పరిచాక ద్వితీయార్ధం మీద చాలా ఆశలు పెట్టుకుంటాం. ఈ ఏడాది తెలుగు విషయంలోనూ అలాంటి ఆశలే పెట్టుకున్నారు ప్రేక్షకులు. వాళ్ల ఆశలు వమ్ము కావట్లేదు.
ద్వితీయార్ధానికి ‘బాహుబలి’ సినిమా తిరుగులేని ఆరంభాన్నిస్తే.. ఆ తర్వాత వస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ ను కళకళలాడిస్తున్నాయి. రెండు నెలల కాలంలో రెండు బ్లాక్ బస్టర్ లు.. రెండు సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోతోంది. బాహుబలి జులై నెలంతా ప్రభంజనం సృష్టించింది. ఆ నెలంతా థియేటర్ల దగ్గర మామూలు సందడి లేదు. బాహుబలి హవా తగ్గే సమయానికి శ్రీమంతుడు అందుకున్నాడు. ఆ సినిమా సందడి ఇంకా కొనసాగుతోంది. ‘శ్రీమంతుడు’ వచ్చిన తర్వాతి వారం విడుదలైన చిన్న సినిమా ‘సినిమా చూపిస్త మావ’ అంచనాల్ని మించి విజయాన్నందుకుని.. దాని స్థాయికి సూపర్ హిట్ రేంజి అందుకుంది. ఇక పోయిన శుక్రవారం విడుదలైన ‘భలే భలే మగాడివోయ్’ అనూహ్యమైన వసూళ్లతో చిన్న సినిమాలకు బెంచ్ మార్క్ గా నిలుస్తోంది. స్టార్ హీరోల సినిమాల తరహాలో భారీ వసూళ్లు దక్కుతున్నాయీ సినిమాకి. మొత్తంగా చూస్తే సెకండాఫ్ లో తొలి రెండు నెలలు టాలీవుడ్ కు తిరుగులేదనిపిస్తోంది. మిగిలిన నాలుగు నెలల్లో మరెన్నో భారీ, క్రేజీ సినిమాలు లైన్ లో ఉండటంతో సెకండాఫ్ బొమ్మ పూర్తయ్యేసరికి తెలుగు సినిమా సూపర్ హిట్ రేంజిని అందుకుంటుందేమో.