‘‘ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు. స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. యాక్టర్లు అదరగొట్టేశారు. డైరెక్టర్ విరగదీసేశాడు.. ఇలాంటి సినిమా థియేటర్లలో చూసే తీరాలి.’’ఈ మధ్య కాలంలో సినిమా రిలీజుకు మందు ఇదే తరహా మాటలు బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రిలీజుకు ముందు రోజుల్లో చెప్పే మాటలు కోటలు దాటిపోతున్నాయి. అంతని.. ఇంతటి.. ఇదో అద్భుతమని చివరకు పరమ రొటీన్ సినిమాలే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. దాంతో మ్యాట్నీకే థియేటర్ల ముందు జనాలు కనిపించని పరిస్థితి.
సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాలన్నా.. ఎక్కువ కలెక్షన్లు రాబట్టాలన్నా పబ్లిసిటీ కీలకం. ముఖ్యంగా సినిమా రిలీజుకు ముందు హీరో... డైరెక్టర్.. ప్రొడ్యూసర్.. ఇలా టీం మొత్తం మీడియా ముందుకొచ్చి తమ సినిమా గురించి మహా గొప్పగా చెబుతున్నారు. వీళ్లు చెప్పే మాటలకు ప్రేక్షకుల్లో అంచనాలు మరీ ఎక్కువైపోతాయి. తీరా వెళ్లాక రొటీన్ సినిమా అని తేలిపోవడంతో సినిమాను తిప్పికొట్టేస్తున్నారు. దీంతో యావరేజ్ గా ఆడాల్సిన సినిమాలు కూడా అట్టర్ ఫ్లాపులుగా మారిపోతున్నాయి. ఈ మధ్య వచ్చిన వాటిలో టట్ చేసి చూడు.. మనసుకు నచ్చింది.. ఇంటిలిజెంట్ వంటి సినిమాలకు ఇదే తరహా పబ్లిసిటీ చేశారు. ఇంటిలిజెంట్ సినిమా గురించి హీరో.. ప్రొడ్యూసర్.. డైరెక్టర్ మరీమరీ గొప్పగా చెప్పుకొచ్చారు. తీరా చూస్తే అది హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ అయింది.
తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. మార్కెటింగ్ చేసుకోవడానికి మంచి అవకాశాలు వచ్చాయి. స్టార్ వాల్యూ ఉన్న హీరోలో.. సెలబ్రిటీలో సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెబితే రిలీజ్ కు ముందు మంచి బిజినెస్ జరుగుతుంది. ఈ కారణంతో సినిమాకు ఓవర్ హైప్ తెస్తున్నారనేది ఓ నిర్మాత మాట. ‘‘సినిమా షూటింగ్ జరుగుతుండగా అది ఆడేది.. లేనిదీ చాలావరకు తెలిసిపోతుంది. కానీ ఆ మాట చెబితే బయ్యర్లు ముందుకు రారు. అందుకోసమే సినిమా గురించి కాస్తంత ఎక్కువ చేసి చెబుతున్నాం. తీరా అది చివరకు సినిమాకే నెగిటివ్ గా మారుతోంది.’’ అని ఇటీవల కాలంలో సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్న ఓ నిర్మాత కాస్తంత ఆవేదనతో చెప్పుకొచ్చారు.