ఇక్కడ డబ్బింగ్‌ చేయనివ్వలేదా??

Update: 2016-02-06 03:57 GMT
ఈ మధ్యన బాలీవుడ్‌ లో వస్తున్న సూపర్‌ హిట్‌ సినిమాలన్నీ డైరెక్టుగా తెలుగులోకి వచ్చేస్తున్నాయి. పెద్దపెద్ద హీరోలే స్వయంగా తెలుగులోకి డబ్బింగ్‌ చేసి రిలీజ్‌ చేసుకుంటున్నారు. షారూఖ్‌ ఖాన్‌.. సల్మాన్‌ వంటి నటులు.. తమ సినిమాల డబ్బింగ్‌ వర్షన్‌ ను ఏకంగా ఒరిజినల్‌ హిందీ వర్హన్‌ తో కలిపి రిలీజ్‌ చేసి.. కనీసం ఇక్కడి నుండి 3 కోట్ల గ్రాస్‌ అయినా పట్టికెళ్తున్నారు.

అయితే ఈ మధ్యన ఒక తెలుగు సినిమా నిర్మాతకు నిర్మాతల మండలిలోని కొందరు పెద్దలు ఈ డబ్బింగ్‌ సినిమాల విషయంలో ఒక షాక్‌ ఇచ్చారట. అదేంటంటే.. సన్నీ లియోన్‌ హీరోయిన్‌ గా రూపొందిన ''మస్తీజాదే'' సినిమాను ఇక్కడ ఒక నిర్మాత రిలీజ్‌ చేద్దాం అనుకున్నాడట. కాని ఈ సినిమాను రిలీజ్‌ చేయకుండా అడ్డుకున్నారట కొందరు పెద్దలు. గతంలో షకీలా సినిమాలనే ఆపేశాం ఇప్పుడు సన్నీ లియోన్‌ సినిమాలంటే ఎలా రిలీజ్‌ చేయనిస్తాం అనుకున్నావ్‌ అంటూ కడిగిపాడేశారట.

అసలు సన్నీ లియోన్‌ సినిమాలో మరీ షకీలా సినిమా రేంజులో బూతు శృంగారం ఏమీ ఉండదు. కాకపోతే బూతు మాటలు.. బూతు జోకులూ ఉంటాయంతే.  కాని దానిని కూడా సహించలేం అన్నారంటే.. సన్నీ లియోన్‌ ను అంత పెద్ద కాంపిటీషన్‌ గా ఫీలయ్యారా?
Tags:    

Similar News