కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లుంది

Update: 2018-06-02 14:30 GMT
కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్టు సినిమా ప్లాప్ కి కూడా వెయ్యి కారణాలు చెప్పడం ఈ రోజుల్లో మేకర్స్ బాగా అలవాటైపోయింది. సక్సెస్ అయితే ప్రతిది బాగుంటుంది. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆ సంబరాలు చేసుకునే విధానం ఒక లెవెల్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్లాప్ అయితే ఎదో ఒక కారణం కాకుండా సమయాన్ని బట్టి పలు రకాల కారణాలు చెబుతుండడం హాట్ టాపిక్ అయ్యింది.

ఒక సినిమా నిర్మించాలి అంటే నిర్మాతలకు శక్తికి మించిన పని. ముఖ్యంగా చిన్న నిర్మాతలకు ఆ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే మేకర్స్ మాత్రం కంటెంట్ కంటే ఎక్కువగా ఇతర విషయాలపై ఎక్కువ ద్రుష్టి పెడుతున్నారు. ముఖ్యంగా కాంబినేషన్స్ అంటే చాలు వెంటనే నిర్మాతలు కూడా ఆశపడి డబ్బులు ధారపోస్తున్నారు. దీంతో ఆ తరువాత తెల్ల మొహం వేయక తప్పడం లేదు. ఈ మధ్య కాలంలో కాంబినేషన్ ఇచ్చిన డిజాస్టర్స్ లిస్ట్ పెద్దగానే ఉంది.

చెబితే మనోభావాలు దెబ్బ తింటాయి అంటారు. ఇక సినిమాలో మ్యాటర్ లేకుండా తెరకెక్కించి ఫ్లాప్ అయితే ప్రమోషన్స్ సరిగ్గా చేయలేదు. రివ్యూలు దెబ్బేశాయి అంటారు. రివ్యూలు బాగా వచ్చినప్పుడు అదే పోస్టర్ లో వేసుకొని ప్రమోషన్స్ చేసుకుంటారు. ఫ్లాప్ అయితే మాత్రం ఒక్క మాటలో ప్రమోషన్స్ ఫ్లాప్ అయ్యింది అనేస్తారు. ఇది ఇప్పుడున్న కొంత మంది వరస..  


Tags:    

Similar News