వామ్మో.. బడా హీరోకు అన్యాయం చేశారు

Update: 2015-10-23 11:07 GMT
తీసింది 150 కోట్ల బాహుబలి సినిమా అయినా.. లేదా 30 లక్షల బడ్జెట్‌ ఈరోజుల్లో సినిమా అయినా.. కథ అనేది ముందే చెప్పేస్తే ఏ మాత్రం కిక్‌ ఉండదు. అసలు పొరపాటు ఎలా జరిగిందో తెలియదు కాని.. ఈరోజు ''ఒక పెద్ద సినిమా'' విషయంలో కొంప కొల్లేరు అయిపోయింది.

ఉదయాన్నే ఒక టాప్‌ హీరో సినిమా తొలి అఫీషియల్‌ టీజర్‌ ను యుట్యూబ్‌ లో రిలీజ్‌ చేస్తారని అనుకుంటే.. సదరు సినిమాను నిర్మించిన సంస్థ తమ అఫీషియల్‌ వెబ్‌ పేజీలో విడుదల చేసింది. అంతటితో ఆగారా.. ఒక ఫుల్‌ సినాప్సిస్‌ ను కూడా పక్కనే ఇంగ్లీషులో రాసి పెట్టేశారు. సాధారణంగా సినాప్సిస్‌ అంటే మనం రివ్యూలో కథను చెబుతాం చూడండి.. అలా ఉండాలి. కాని ఇక్కడ మాత్రం ఏకంగా పూర్తి కథనే చెప్పేశారు. అసలు సినిమాలో ఏ పాత్ర ఏంటి.. సినిమాలో ట్విస్టులు ఏంటి.. హీరో పాత్ర ఏం చేస్తుంది.. ఆయన ఫ్లాష్‌ బ్యాక్‌.. ఆయన ఏం కంపెనీకి యం.డి.  ఇలా మొత్తంగా కథ అంతా రిలీజ్ చేసేశారు. ఈ దెబ్బతో స్టోరీ అంతా లీకైపోయినట్లే. ఇది సినిమాకు అతి పెద్ద దెబ్బ మరి.

లేటుగా తమ అత్యుత్సాహం గురించి తెలుసుకున్న సదరు నిర్మాణ సంస్థ.. ఆ కథను తొలిగించేసింది కాని.. అప్పటికే డ్యామేజ్‌ జరిగిపోయింది. ఫేస్‌ బుక్‌ నుండి వేరే ఇతర సోషల్‌ మాద్యమాల అన్నింటిలో ఈ కథ షేర్‌ అయిపోయింది. టీజర్‌ లో డైలాగులు చూసి ఫ్యాన్సు ఆనందపడినంత సేపు లేదు.. ఈ కథ చేసిన డ్యామేజీ. ఒక బాధ్యతగల సంస్థ ఇలా చేయడమేంటసలు.. ఇప్పుడు ఎన్ని క్షమాపణలు చెప్పినా లాభం లేదు.
Tags:    

Similar News