టాలీవుడ్ టాప్ 10 బిగ్గెస్ట్ లాస్ మూవీస్

Update: 2019-11-04 15:03 GMT
తెలుగు సినిమా హిస్ట‌రీలో పంపిణీదారుల‌కు అత్యంత భారీ న‌ష్టాలు తెచ్చిన టాప్ 10 సినిమాల జాబితా ఏది?  ఏ సినిమా వ‌ల్ల బ‌య్య‌ర్ల‌కు ఎంత న‌ష్టం? అన్న‌ది ప‌రిశీలిస్తే షాకిచ్చే నిజాలే తెలిసాయి. ఈ జాబితాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన‌వి రెండు సినిమాలు.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన‌వి మూడు సినిమాలు టాప్ 10 డిజాస్ట‌ర్ల‌లో ఉన్నాయి. అలాగే చిరు.. ప్ర‌భాస్ న‌టించిన ఒక్కో సినిమా ఈ జాబితాలో నిలిచాయి. బాల‌య్య చేసిన‌ రెండు సినిమాలు ఉన్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే డిజాస్ట‌ర్ అని టాక్ వ‌చ్చి న‌ష్ట‌పోయిన‌వి ఉన్న ఈ జాబితాలో బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ తెచ్చుకుని న‌ష్టాలు తెచ్చిన సినిమా కూడా ఒక‌టి ఉంది. ఆ వివ‌రాలేమిటో మీరే చ‌ద‌వండి.

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన పాన్ ఇండియా చిత్రం `సాహో` అన్నిచోట్లా డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు తెచ్చినా.. తెలుగు రాష్ట్రాలు స‌హా సౌత్ లో భారీ న‌ష్టాలు తెచ్చింది. న‌ష్టం ఎంత అంటే .. దాదాపు 80 కోట్ల మేర న‌ష్టం ఉంటుంద‌ని అంచ‌నా. ఆ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ `అజ్ఞాత‌వాసి` ఏకంగా 70.1 కోట్ల న‌ష్టంతో రెండో స్థానంలో నిలిచింది. 65 కోట్ల న‌ష్టాల‌తో  మెగాస్టార్ చిరంజీవి న‌టించిన పాన్ ఇండియా చిత్రం `సైరా`  మూడో స్థానంలో ఉంది. రిలీజైన అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల‌లో ఊహించ‌ని ఫ‌లితాన్ని ఎదుర్కొంది ఈ చిత్రం. అయితే హిందీ వ‌సూళ్లు పెద్ద‌గా ఆశిస్తే తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయ‌ని నిర్మాత రామ్ చ‌ర‌ణ్ స్వ‌యంగా తెలిపారు. తెలుగు రాష్ట్రాల వ‌సూళ్లే సైరాను ర‌క్షించాయ‌ని అన్నారు.

మ‌హేష్ న‌టించిన స్పైడ‌ర్ 55 కోట్ల న‌ష్టాల‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ త‌ర్వాత ఐదో స్థానం ఆరో స్థానం ఎన్బీకే న‌టించిన‌ ఎన్టీఆర్ బ‌యోపిక్ చిత్రాలు ఆక్ర‌మించాయి. ఎన్టీఆర్ పార్ట్ 1 50.27 కోట్లు.. ఎన్టీఆర్ పార్ట్ 2... 47.22 కోట్లు మేర న‌ష్ట‌పోయాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప‌వ‌ర్ స్టార్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ 42 కోట్ల న‌ష్టాల‌తో 7వ‌ స్థానంలో నిలిచింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన 1నేనొక్క‌డినే 40కోట్ల న‌ష్టాల‌తో 8వ స్థానంలో నిల‌వ‌గా.. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామ 37 కోట్ల న‌ష్టాల‌తో తొమ్మిదో స్థానంలో నిలిచింది. మ‌హేష్ న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం 30.4 కోట్ల న‌ష్టాల‌తో ప‌దో స్థానంలో ఉంది. అదీ సంగ‌తి.
Tags:    

Similar News