ఈ వారం థియేటర్లకు వచ్చిన రెండు సినిమాల్లో జ్యో అచ్యుతానందకు మంచి టాక్ వచ్చింది. ఈ ఎఫెక్ట్ టాప్ రేంజ్ లో ఉన్న జనతా గ్యారేజ్ పై పడుతోంది.
1) జనతా గ్యారేజ్ : మొదటివారంలో రికార్డులన్నీ బద్దలుకొట్టేసిన జనతా గ్యారేజ్ సెకండ్ వీక్ లో స్లో అయింది. అయితే.. రెండో ఆదివారం నాడు మాత్రం అదిరిపోయే కలెక్షన్స్ రావడంతో.. టాప్ స్పాట్ ని నిలబెట్టుకోవడం గ్యారేజ్ కి సాధ్యమైంది. ఇప్పటికే ఈ మూవీ కొన్న బయ్యర్స్ అందరూ ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేయడం హైలైట్ గా చెప్పాలి.
2) జ్యో అచ్యుతానంద : రొమాంటిక్ మూవీ జ్యో అచ్యుతానంద.. ఓపెనింగ్ నెమ్మదిగానే ఉన్నా.. వేగంగా ఊపందుకుంటోంది. ఏ-క్లాస్ సెంటర్లలో ఇరగదీసి ఆడేస్తుంటే.. బీ-సీ సెంటర్లలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఫస్ట్ వీకెండ్ లో.. ఇండియాలోను-ఓవర్సీస్ లోను మంచి బిజినెస్ చేసిందీ మూవీ.
3) ఇంకొక్కడు: విక్రమ్ మీద నమ్మకంతో మొదటి రోజున కలెక్షన్స్ అదిరిపోయాయి. అయితే కంటెంట్ మరీ దారుణంగా ఉండడం,. మౌత్ టాక్ - రివ్యూలు నెగటివ్ గా ఉండడంతో స్లో అయిపోయాడు ఇంకొక్కడు. విక్రమ్ అకౌంట్ లో మరో ఫ్లాప్ పడిపోయినట్లే లెక్కేసుకోవాలి.
4) బార్ బార్ దేఖో: కత్రినా కైఫ్-సిద్ధార్ధ మల్హోత్రాల రొమాంటిక్ మూవీ బార్ బార్ దేఖోను.. మల్టీప్లెక్స్ ఆడియన్స్ బాగానే ఆదరిస్తున్నారు. ముఖ్యంగా నైజాంలో ఈ మూవీకి కలెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి.
5) పెళ్లి చూపులు:లోబడ్జెట్ మూవీ అయిన పెళ్లిచూపులు చిత్రానికి థియేటర్లు తగ్గిపోవడం బాగా ఎఫెక్ట్ చూపించింది. ఏ సెంటర్లలో బాగానే ఆడుతుండగా.. వీకెండ్స్ లో ఇంకా ఫుల్స్ పడుతుండడం విశేషం. పెట్టుబడికి 15 రెట్లు కలెక్షన్స్ తెచ్చిపెట్టి.. నిర్మాతలకు భారీ లాభాలు పంచిందీ సినిమా.