నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచో ఇదిగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడు అంటూ మోక్షు ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. అది ఇంతవరకూ జరగలేదు.
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం భారీగా ప్లాన్స్ ఉన్నాయని అప్పట్లో బాలయ్య స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నందమూరి హీరో లాంచింగ్ ప్రాజెక్ట్ కోసం బోయపాటి శ్రీను - పూరీ జగన్నాథ్ ల నుంచి అనిల్ రావిపూడి - క్రిష్ జాగర్లమూడి వరకూ చాలామంది ప్రముఖ దర్శకుల పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే ఏదీ నిజం కాలేదు.
అయితే ఇప్పుడు కొత్తగా మరో దర్శకుడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్ నడుస్తోంది. యంగ్ డైరెక్టర్ ఇప్పుడు మోక్షు కోసం ఓ స్టోరీ రాసుకున్నాడట. ఇప్పటికే మోక్షజ్ఞని కలిసి కథ కూడా వినిపించాడని.. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు.
ఇటీవల మోక్షజ్ఞ తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ను టర్కీలో #NBK107 సెట్ లో జరుపుకున్న సంగతి తెలిసిందే. అక్కడికి రాహుల్ సంకృత్యాన్ కూడా వెళ్లాడని.. బాలయ్యకు కూడా కథ వినిపించాడని టాక్ వచ్చింది. ఆయన కూడా ఓకే అనడంతో దాదాపుగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయినట్లేనని అనుకుంటున్నారు.
'టాక్సీవాలా' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన రాహుల్.. 'శ్యామ్ సింగరాయ్' చిత్రంతో ఆకట్టుకొన్నాడు. ఇప్పుడు మోక్షజ్ఞని వెండి తెరకు లాంచ్ చేయడానికి ఒక వైవిధ్యమైన లవ్ స్టోరీ రాసుకున్నాడట. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ మూవీ పట్టాలెక్కుతుందని టాక్.
నందమూరి వారసులైన జూనియర్ ఎన్టీఆర్ (నిన్ను చూడాలని) - కళ్యాణ్ రామ్ (తొలి చూపులోనే) - తారక రత్న (ఒకటో నెం. కుర్రాడు) ముగ్గురూ ప్రేమ కథలతోనే హీరోలుగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కాకపోతే వీరికి డెబ్యూ చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు మోక్షజ్ఞ ని కూడా తొలి సినిమాతో మాస్ ఇమేజ్ కు దూరంగా ప్రజెంట్ చేయాలని భావిస్తున్నారనే వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.
వాస్తవానికి 'ఆదిత్య 369' కు సీక్వెల్ గా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కే 'ఆదిత్య 999 మాక్స్' సినిమా ద్వారా మోక్షజ్ఞ లాంచింగ్ ఉంటుందని బాలకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు రాహుల్ దర్శకత్వంలో తనయుడి తెరంగేట్రం ఉంటుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.