ప్రతీ ప్యాషన్ కి ఓ సీజన్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే.. పొడుగు గెడ్డాలు పెంచేయడం. ఇప్పటికే ఎన్టీఆర్ ఇలాంటి లుక్ రెండు సార్లు ఇచ్చి మాంచి హిట్స్ కొట్టేశాడు. జూనియర్ లాంటి స్టార్ హీరో ఈ రేంజ్ లో రూట్ చూపిస్తే.. కుర్రాళ్లు ఊరుకుంటారా? వరల్డ్ వైడ్ గా లేటెస్ట్ ట్రెండ్ గెడ్డాలు ఏమున్నాయో లిస్ట్ తీసి.. అందుకు తగ్గట్లుగా పెంచేస్తున్నారు.
ఎన్టీఆర్ ఇప్పటికీ పెద్ద గెడ్డంతోనే ఉన్నాడు. మరుసటి మూవీలో ఇంకో కొత్త బియార్డ్ లుక్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక యంగ్ హీరోలు నాగశౌర్య.. నారా రోహిత్.. వరుణ్ తేజ్.. నిఖిల్.. నితిన్ లు కూడా గెడ్డాలు పెంచేస్తున్నారు. వీరంతా తమ మరుసటి సినిమాల్లో ఈ కొత్త లుక్ తో ఆకట్టుకోబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల ట్రెండ్స్ ని తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారు. మరోవైపు లగ్జరీ కార్ల ప్యాషన్ కూడా ఊపందుకుంటోంది.
రీసెంట్ గా నాగశౌర్య ఓ లగ్జరీ కార్ కొన్నాడు. తన దగ్గరున్న ఓ పోష్ మోడల్ కారును పక్కన పెట్టి.. బెంజ్ లో జి క్లాస్ ఎస్యూవీ తీసుకున్నాడు. దీని ఖరీదు కోటి 10 లక్షల రూపాయలు. అలాగే నారా రోహిత్ కూడా BMW స్పోర్ట్స్ కార్ ఒకటి కొన్నాడు . మరోవైపు వరుస హిట్స్ దూసుకుపోతున్న నిఖిల్ కూడా కాస్ట్లీ కార్ ఒకటి తన గ్యారేజ్ లోకి తీసుకొచ్చాడు. ఇది కూడా బెంజ్ కారు కాగా సీఎల్ ఏ క్లాస్ స్పోర్ట్స్ మోడల్ ఇది. ఇక అల్లు శిరీష్ కి కూడా రీసెంట్ గా ఓ లగ్జరీ కార్ చేతికొచ్చింది.
ఆడి క్యూ7 మోడల్ కార్ లో చక్కర్లు కొట్టేస్తున్నాడు శిరీష్. కాకపోతే.. ఈ కుర్రాడికి వాళ్ల నాన్న అరవింద్ గిఫ్ట్ గా ఇచ్చాడంతే. పెద్ద పెద్ద గెడ్డాలతో.. లగ్జరీ కార్లతో దూసుకుపోయేందుకు హీరోలంతా ప్రిపేర్ అయిపోతున్నారన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/