ఎర్రజెండా కనుమరుగవుతుందన్నా..

Update: 2016-07-18 17:30 GMT
ఎంతకాదనుకున్నా తెలుగు సినిమా మాస్ - క్లాస్ అంటూ విభజన పర్వంపైనే నడుస్తుంది. మాస్ ప్రేక్షకులను ఆదరించాలంటే దుమ్ము దులిపే ఫైట్లు - ఎంటర్ టైన్ మెంట్ - పంచ్ డైలాగులు - అందాల ఆరబోత తప్పనిసరి అనే టెంప్లెట్ లో ఫిక్సయ్యాం. అయితే వీటన్నిటికీ వెన్నుముకగా నిలిచిన హీరో పాత్రను మాత్రం మర్చిపోతున్నాం.

ఇప్పుడంటే కనిపించడంలేదుగానీ ఒకప్పుడు మన హీరోలు మాస్ సినిమాలు చేసే టైంలో లేబర్ పాత్రలకు ఓటు వేసేవారు. కూరగాయల బస్తాలను మోసే మేస్త్రిగా ముఠామేస్త్రి సినిమాలో లేబర్ రాజసం చూపించాడు. బొగ్గుగనుల తవ్వకాలలో వుండే కష్టాలను బాలకృష్ణ నిప్పురవ్వ సినిమాలో స్వయంగా నటించి చూపించాడు. వెంకటేష్ కూలీగా - నాగార్జున జట్కా బండి నడుపుతూ ఆ వర్గం ప్రేక్షకులకు అమితానందాన్ని ఇచ్చాడు. తమిళనాట సూపర్ స్టార్ కూడా బాషా సినిమాలో ఆటో డ్రైవర్ గా కనిపించడం అతని కెరీర్ లోనే మార్పు తెచ్చింది. ఆర్ నారాయణమూర్తి సినిమాలన్నీ లేబర్ ప్రాధాన్యమైనవే.

ఈ విధమైన పాత్రలకు నేటితరం హీరోలు దూరమైపోవడం కాస్త బాధాకరం. పవన్ కళ్యాణ్ తొలినాళ్ళలో కనీసం పాటలోనైనా కూలీ గెట్ అప్ లో మెరిశాడు. ప్రస్తుత యువహీరోలు అయితే కాలేజీ కుర్రాళ్ళుగా లేకపోతే జులాయి - పోకీరులుగా కనిపించడానికి ఇష్టపడుతున్నారే తప్ప డిగ్నిటీ ఆఫ్ లేబర్ సూత్రాన్ని అవలంబించుకునే ప్రయత్నం చెయ్యడంలేదు.  
Tags:    

Similar News