హాలీవుడ్ స్టార్ టామ్ హ్యాంక్స్ ఇంకా ఆయన భార్య రీటా విల్సన్ లకు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెల్సిందే. వీరు మెరుగైన చికిత్స పొంది కరోనా నుండి విముక్తి అయ్యారు. ఆస్ట్రేలియాకు వెళ్లిన వీరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆస్ట్రేలియాలోనే ఐసోలేషన్ లో ఉన్న టామ్ హ్యాంక్స్ సోషల్ మీడియాలో పలు విషయాలను పోస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ సమయంలో తాను తీసుకుంటున్న ఫుడ్ అంటూ గతంలో ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. తాజాగా ఈ దంపతులు తీసుకున్న నిర్ణయంతో మరోసారి చర్చనీయాంశం అయ్యారు.
కరోనాతో శాస్త్రవేత్తలు చేస్తున్న పోరాటంకు మద్దతుగా నిలిచేందుకు ఈ దంపతులు ముందుకు వచ్చారు. తమవంతు సాయం అన్నట్లుగా తమ రక్తంను శాంపిల్స్ కోసం ఇవ్వడంతో పాటు ప్రయోగానికి సహకరిస్తామని పేర్కొన్నారు. ఇతర పేషంట్లను కాపాడేందుకు తమ ప్లాస్మాను కూడా డొనేట్ చేసేందుకు రెడీగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.
కరోనాతో వీరు చేసిన పోరాటం అందరికి స్ఫూర్తి అంటూ ప్రముఖులు కొనియాడుతున్నారు. ఈ సమయంలో టామ్ హ్యాంక్స్ తన రక్తంను డొనేట్ చేయడంతో పాటు ప్లాస్మాను కూడా ఇచ్చేందుకు ముందుకు రావడం నిజంగా అభినందనీయం అంటూ ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.