లీకులపై రంకెలేసిన హీరోయిన్!!

Update: 2017-04-11 04:53 GMT
దక్షిణాదిలో ఆమె ఓ ప్రముఖ హీరోయిన్. సౌత్ ఇండియా క్వీన్ అని రీసెంట్ గానే పేరు తెచ్చేసుకుంది. ఈ మధ్య కొన్ని సినిమాలు డిజప్పాయింట్ చేసినా.. పేరు క్రేజ్ మాత్రం గొప్పగానే ఉన్నాయి. అయితే.. ఈమెకు సంబంధించిన కొన్ని ప్రైవేటు ఫోటోలు ఇప్పుడు  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడంతో ఎలర్ట్ అయింది.

తన ప్రియుడితో కలిసి ఈ మధ్యనే ఓ ఫారిన్ ట్రిప్ వేసుకుంది ఈ బ్యూటీ. ఇదంతా సీక్రెట్ గా జరిగేలా ప్లాన్ చేసుకుని పూర్తి చేశారు కూడా. అయితే.. ఈ సమయంలో తీసుకున్న ప్రైవేటు ఫోటోలు నెట్ లోకి వచ్చేశాయి. ఈ విషయంలో ప్రియుడి తప్పేమీ లేదని తెలుసుకున్న ఈ భామ.. చివరకు తన మేనేజర్ పై గట్టిగానే రంకెలేసిందట. పైగా ఉద్యోగంలోంచి పీకేస్తానని కూడా హెచ్చరించిందట. అయితే.. ఈ లీకులకు మేనేజర్ కు ఏ సంబంధం లేదని టాక్. ఆ విషయాన్ని ఈ హీరోయిన్ కూడా తర్వాత గ్రహించింది.

నిజానికి లీకుల హంగామా ఆమె దగ్గరే మొదలైందట. వాట్సాప్ లో పొరపాటున తనే ఈ ఫోటోలను షేర్ చేసేసిందట. ఆ విషయం తెలిసిన తర్వాత సైలెంట్ గా ఉండిపోయిన ఈమె.. నెట్ లోంచి వాటిని క్లియర్ చేసేయాలని హుకుం జారీ చేసింది. ప్రస్తుతం ఆ హీరోయిన్ టీం అంతా అదే పనిలో బిజిబిజీగా ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News