పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా 'కేజీఎఫ్' ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సలార్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ ప్రకటనతోనే అంచనాలు స్కైని టచ్ అవ్వడం మొదలైంది. భారీ కాన్సాస్ పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'కేజీఎఫ్' ని మించి యాక్షన్ కిక్ ఉంటుందని అంచనాలకు ధీటుగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ లాంటి భారీ కటౌట్ కి తగ్గ సరైన కంటెంట్ 'సలార్' అని ఇంటా బయటా ప్రచారం ఠారెత్తిపోతుంది.
ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. మొత్తం రెండు భాగాలుగా 'సలార్' రిలీజ్ కానుందని.. ఆప్రణాళికతోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ షూటింగ్ షెడ్యూల్ ని సైతం డిజైన్ చేసినట్లు ప్రచారం సాగింది. రెండున్నర గంటల్లో చెప్పాల్సిన కథ కాదని..'కేజీఎఫ్' తరహాలో హైలైట్ చేయాలంటే రెండు భాగాలుగా తీయాల్సిన సినిమా అని డిసైడ్ అయి ముందుకు వెళ్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో సైతం చర్చకొచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వైరల్ అవుతుంది. 'సలార్' కేవలం ఒక భాగంగానే తెరకెక్కిస్తున్నారని..రెండు భాగాలు కాదంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
ఇదే పెద్ద ట్విస్ట్ అనుకుంటే దీనికి మించిన మరో ట్విస్ట్ కూడా ఇందులో ఉంది. ఇది ఓ కన్నడ సినిమా రీమేక్ అని సమాచారం. అదీ ప్రశాంత్ నీల్ డెబ్యూ మూవీ 'ఉగ్రం' ని తెలుగు..కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నట్లు ఓ వార్త షేక్ చేస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
ఇక కన్నడ 'ఉగ్రం' విషయానికి వస్తే ఈ సినిమా కూడా భారీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. 2014 లో సినిమా కన్నడలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. శ్రీ మురళి హీరోగా నటించగా...హరి ప్రియ హీరనోయిన్ గా నటించింది.
ఈ సినిమా షూటింగ్ కూడా టఫ్ లోకషన్స్ లోనే జరిగింది. భారత్ గోల్డ్ మైన్స్ - కోలార్ గోల్డ్ ఫీల్స్డ్ లోనే కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కోలార్ గోల్డ్ మైన్స్ లో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా 'ఉగ్రం' కావడం విశేషం. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం 'కేజీఎఫ్' ని కూడా అక్కడే చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సలార్ ఒక్క భాగం అన్న ప్రచారం ఒక్క సారిగా హైప్ పైనా ప్రభావం చూపిస్తోంది.
పైగా రీమేక్ కథ అంటే అంచనాలు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మిర ఈ విషయం నిజమైతే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అన్నది చూడాలి. 'సలార్' లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబోలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. కన్నడలో కేఆర్ జీ స్టూడియోస్..తెలుగులో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని డిస్ర్టిబ్యూట్ చేస్తున్నాయి.