పుల్వామా ఘటనలో వీర జవాన్ల మరణం తాలూకు విషాదాలు దేశ పౌరులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ దీని గురించి కదిలిపోయారు. ఎవరిని కదిపినా దాయాది దేశం మీద విరుచుకుపడుతున్నారు. ఇవాళ ఎన్ కౌంటర్ లో కొందరు తీవ్రవాదులను మట్టుబెట్టారన్న వార్త తెలుసుకుని చాలా చోట్ల బాణా సంచా కూడా పేల్చారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆర్టిస్టుల మీద బ్యాన్ విధిస్తూ అల్ ఇండియా సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తన వంతు మద్దతుగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఓ స్ఫూర్తి దాయక చర్యకు ఉపక్రమించాడు. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న టోటల్ డమాల్ ను పాకిస్తాన్ లో విడుదల చేయడం లేదని ప్రకటించేసాడు. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో నైతిక మద్దతు కోసం ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్పేసాడు. ఇది ఒకరకంగా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే టోటల్ డమాల్ భారీ మల్టీ స్టారర్. అజయ్ దేవగన్ కెరీర్లోనే అత్యంత భారీ ఖర్చుతో నిర్మించారు. గ్రాఫిక్స్ కోసం చాలా ఖర్చయ్యింది.
ఈ నేపధ్యంలో పాక్ రిలీజ్ వద్దు అనుకోవడం అంటే ఎంత లేదన్నా 10 నుంచి 15 కోట్ల దాకా నష్టం తప్పదు. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చాలా రోజుల క్రితమే అడ్వాన్సులు ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు.ఇప్పుడవి రద్దు చేసి సొమ్ము వెనక్కు ఇవ్వాలి. ఇదంతా రిస్క్ తో ముడిపడిన వ్యవహారం. అయినప్పటికీ అజయ్ దేవగన్ దీని గురించి చాలా మంచి పని చేసాడు. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన టోటల్ డమాల్ ప్రపంచవ్యాప్తంగా ఐదు వేలకు పైగా స్క్రీన్లలో విడుదలకు ఏర్పాట్లు జరిగిపోయాయి. ఒక్క పాక్ లో మాత్రం విత్ డ్రా చేసుకున్నారు