సెన్సార్ టాక్: టచ్ చేస్తే యు/ఎ ఇచ్చారు

Update: 2018-01-24 13:52 GMT
మాస్ మహారాజ రవి తేజ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్ళీ రాజా ది గ్రేట్ గా మన ముందుకు వచ్చాడు. అంధుడిగా నటించిన రవితేజ తనలోని టాలెంట్ మరియు ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించాడు. ఇపుడు తన రాబోతున్న టచ్ చేసి చూడు సినిమా కూడా చాలా అంచనాల మధ్య  విడుదల అవ్వబోతుంది.

రేసుగుర్రం - మిర్చి వంటి సూపర్ హిట్ చిత్రాలకు రైటర్ గా పనిచేసిన విక్రమ్ సిరికొండ ఈ సినిమాతో డైరెక్టర్ అవ్వబోతున్నాడు. ఈ మధ్యనే సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ తో బయటకు వచ్చింది. రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మాస్ మహారాజ ఇపుడు నెలల వ్యవధిలోనే సినిమాలు రిలీజ్ చేయడం చేస్తూ ఉండటం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత మన అందరికి షాక్ ఇచ్చి రవి తేజ పోలీస్ అవతారం ఎత్తబోతున్నాడట. ఫస్ట్ హాఫ్ అంత మారువేషంలో తిరిగిన సెకండ్ హాఫ్ లో పోలీస్ ఆఫీసర్ గా కిక్కిస్తాడట. సెన్సార్ వారు మాత్రం సినిమా మాస్ సెంటర్లలో పక్కా హిట్ అంటున్నారు.

రాశి ఖన్నా- సీరత్ కపూర్ ఈ సినిమాలో రవితేజ పక్కన హీరోయిన్లుగా కనిపిస్తున్నా సంగతి తెలిసిందే. ఆల్రెడీ రిలీజైన సాంగ్ ప్రోమోలను చూస్తుంటే.. రాశి అండ్ సీరత్ పోటీ పడి మరీ గ్లామర్ ను ఆరబోశారనే అర్ధమవుతోంది. అంచనాలను చూస్తుంటే ఈ సినీమా ఫిబ్రవరిలో మంచి మాస్ సినిమాగా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. కాని మనోళ్ళు ఆడియన్స్ కు ఈ మధ్యన ఇస్తున్న షాకులను చూస్తుంటే.. రిలీజ్ వరకు ఏ విషయం చెప్పలేం.
Tags:    

Similar News