కాటమ 40+ తెచ్చినా కూడా...

Update: 2017-03-27 10:11 GMT
మొత్తానికి ఓపెనింగ్ వీకెండ్ పూర్తయ్యింది. ''కాటమరాయుడు'' సినిమా మిక్సుడ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర సతమతమవుతూ ఉంది. టాక్ గురించి చెబితే మాత్రం కావాలనే నెగెటివ్ గా చెబుతున్నారని అనుకుంటారేమో కాని.. కలక్షన్లను చూస్తే మాత్రం కాస్త పర్లేదు అన్నట్లే ఉన్నాయి. తొలి వీకెండ్లో మనోడు మంచి నెంబర్లే రిజిష్టర్ చేశాడు కాని.. ఆ నెంబర్లు సరిపోవు అనేది ఇప్పుడు ట్రేడ్ పండితుల ఉవాచ.

తొలి మూడు రోజుల్లో.. అదే తొలి వీకెండ్లో.. కాటమరాయుడు షుమారు 42 నుండి 43 కోట్ల మధ్యలో వసూలు చేశాడని తెలుస్తోంది. అయితే షుమారు 85 నుండి 90 కోట్ల మధ్యలో ధియేట్రికల్ బిజినెస్ చేసిన రాయుడు.. ఇప్పుడు తొలి వీకెండ్లో 40 కోట్ల పైనే షేర్ వసూలు చేసినప్పటికీ.. ఇది పెద్దగా హెల్ప్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే సినిమా ఇంకా 50 కోట్లు వసూలు చేయాలంటే మాత్రం.. సూపర్ పాజిటివ్ టాక్ ఉండాలి. సోమవారం కలక్షన్లు అనేవి కూడా ఈ సినిమాకు చాలా కీలకం. ఎలాగో ఉగాది హాలిడే ఉంది కాబట్టి.. ఈ రెండు మూడు రోజులు కూడా పవన్ కు కాస్త అడ్వాంటేజ్ ఉంది.

డాలీ డైరక్షన్లో రూపొందిన కాటమరాయుడు సినిమా అంచనాలను అందుకోలేకపోయిన మాట వాస్వమే. అయితే ఈ సినిమాను రిలీజ్ తరువాత ఇంకాస్త గట్టిగా ప్రమోట్ చేసుకుంటే సినిమాకు మరింత ఎక్కువగా కలక్షన్లు వచ్చే ఛాన్సుండేది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News