ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం దసరా కానుకగా ఈనెల 11న అంటే మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ఈ చిత్రం భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాదాపు 90 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రంను నిన్న మొన్నటి వరకు ‘నోటా’ చిత్రం కాస్త భయపెట్టింది.
‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ‘నోటా’ చిత్రం అరవింద సమేత చిత్రానికి వారం రోజుల ముందు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్టీఆర్ మూవీ కలెక్షన్స్ పై ప్రభావం ఉంటుందని అంతా భావించారు. ‘నోటా’ సక్సెస్ టాక్ దక్కించుకుంటే ఖచ్చితంగా అరవింద సమేత కలెక్షన్స్ తగ్గుతాయని ట్రేడ్ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని ‘నోటా’ ఫలితం తారు మారు అయ్యింది. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో సినిమా విఫలం అయ్యింది. దాంతో అరవింద సమేత చిత్రానికి ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘అరవింద సమేత’ చిత్రానికి మరే పోటీ లేకపోవడంతో వారం రోజుల పాటు భారీ వసూళ్లతో దుమ్ము రేపడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరుస సెలవులు మరియు విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో అరవింద సమేత చిత్రంకు భారీగా ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ తో పాటు భారీ లాంగ్ రన్ వసూళ్లను కూడా సాధిస్తుందని నందమూరి ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. పోటీ లేని కారణంగా వారి ఆశ నెరవేరుతుందని విశ్లేషకులు కూడా అంటున్నారు. ఏం జరుగుతుందో మరో మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.