ట్రైలర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా శ్రీనివాస్ రెడ్డి 'ముగ్గురు మొనగాళ్లు'..!
టాలీవుడ్ స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓవైపు హాస్యనటుడిగా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు హీరోగా కూడా మెప్పిస్తున్నాడు. 'గీతాంజలి' 'జయమ్ము నిశ్చయమ్మురా' వంటి సినిమాలలో హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి.. ఇప్పుడు ''ముగ్గురు మొనగాళ్లు'' అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
శ్రీనివాస్ రెడ్డి మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో కన్నడ హిట్ మూవీ 'దియా' ఫేమ్ దీక్షిత్ శెట్టి - వెన్నెల రామారావు ఇతర ప్రధాన పాత్రధారులుగా కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'ముగ్గురు మొనగాళ్లు' ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ ట్రైలర్ లో శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడిగా.. దీక్షిత్ శెట్టి మూగవాడిగా.. వెన్నెల రామారావు అంధుడిగా మూడు ప్రధాన పాత్రదారులను పరిచయం చేసారు. ఈ ముగ్గురిలో నవ్వించే బాధ్యతను శ్రీనివాస్ రెడ్డి తీసుకున్నారు. హైదరాబాద్ లో బ్యాక్-టు-బ్యాక్ హత్యలు జరిగిన నేపథ్యంలో ఈ కేసును ఛేదించడానికి పోలీసులు ఈ ముగ్గురి సహాయం తీసుకుంటున్నారు. ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ 'ముగ్గురు మొనగాళ్లు' చిత్రం ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇటీవలే కన్నుమూసిన సుప్రసిద్ధ సినీ జర్నలిస్ట్ టీఎన్నార్ ను కూడా ఈ ట్రైలర్ లో చూడవచ్చు.
ట్విషా శర్మ - శ్వేత వర్మ - నాజర్ - రాజా రవీంద్ర - జెమిని సురేష్ - జోష్ రవి - బద్రామ్ - సూర్య - జబర్దస్త్ సన్నీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. గరుడవేగ అంజీ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చగా.. చిన్నా నేపథ్య సంగీతం అందించారు. బి. నాగేశ్వరరెడ్డి ఎడిటర్ గా వ్యవహరించగా.. నాని ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే 'ముగ్గురు మొనగాళ్ళు' సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Full View