కీర్తిసురేష్ కొత్త పంథాలో పయనిస్తోంది. `మహానటి` చిత్రంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డుని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ఆ మూవీ నుంచి నటిగా తన పంథా మార్చుకుంది. సరికొత్త ప్రయాణం మొదలు పెట్టింది. కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే నటనకు ప్రాధాన్యత వున్న చిత్రానల్లో నటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్ టైనర్ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేష్ తాజాగా మరో వైవిధ్యమైన పాత్రలో నటిస్తోంది.
కీర్తిసురేష్‌నటిస్తున్న తమిళ చిత్రం `సన్నికాయిధం`. దర్శకుడు సెల్వరాఘవన్ కూడా ఇందులో కీలక పాత్రలో నటించారు. అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ మూవీని `చిన్ని` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. పక్కా గ్రామీణ యువతిగా ఇందులో కీర్తి సురేష్ గ్లామర్ పాత్రలకు పూర్తి భిన్నంగా డీగ్లామర్ పాత్రలో కనిపించింది. సిద్ధార్థ రావిపూటి నిర్మించిన ఈ చిత్రంలో చిన్నిగా పగా ప్రతీకారాలతో రగిలిపోతూ వరుసగా అత్యంత కిరాతకంగా హత్యలు చేసే యువతిగా కీర్తి సురేష్ నటించింది.
ఆమెకు సహాయకుడిగా సెల్వరాఘవన్ నటించాడు. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మే 6న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని మేకర్స్ విడుదల చేశారు. తమని టార్గెట్ చేసిన వారిని చంపడం కోసం ఎంతకైనా తెగించొచ్చని కీర్తిసురేష్ చెప్పిన డైలాగ్ లు సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా సినిమా రిలీజ్ మరో పది రోజులు వున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా మంగళవారం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు.
అత్యంత దారుణంగా 24 మందిని హత్య చేసిన చిన్ని,రంగయ్య పోలీసులకు పట్టుబడతారు. విచారణ మొదలవుతుంది. పేరేంటి .. ఎన్ని హత్యలు చేశారు? అంటూ పోలీసులు విచారిస్తుంటారు. చినగంజాంకు చెందిన రంగయ్య, సకినేటి పల్లికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ చిన్ని ఎందుకు కలుసుకున్నారు? .. ఈ ఇద్దరు కలిసి 24 మందిని పలు చోట్ల ఎందుకు హత్య చేశారు? అన్నదే ఈ చిత్ర ప్రధాన కథ.
ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న చిన్ని జీవితంలో కొంత మంది సృష్టించిన తుఫాన్ తనని ఎలా ఒంటరిని చేసింది? .. చిన గంజాం కు చెందిన రంగయ్యతో కలిసి చిన్ని ఎలా ప్రతీకారం తీర్చుకుంది. ఇందు కోసం ఎంత మందిని అతి కిరాతకంగా హత్య చేసింది? అనే ఆసక్తికరమైన కథా, కథనాలతో ఈ చిత్రాన్నిదర్శకుడు తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. చిన్ని పాత్రలో డిగ్లామర్ గా కీర్తి సురేష్ పలికించిన హావ భావాలు, ఆ పాత్రలో లీనమై నటించిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాతో కీర్తి సురేష్ నటిగా ప్రశంసల్ని దక్కించుకోవడం ఖాయం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. మే 6న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
Full View