ట్రెండీ స్టోరి: హీరోలకు డెత్ బెల్స్ఆత్మహత్యకు ఆనవాళ్లు లేవు.. పోనీ ఎవరైనా చంపారా? అంటే ప్రూఫ్ లేదు. కానీ చస్తున్నారు. ఒకరి వెంటగా ఒకరు హతం అవుతున్నారు. అలా హతమయ్యేది ఎవరో అయితే పట్టించుకోరు. ఏకంగా కోట్లాదిగా ఫ్యాన్స్ ఉన్న టాప్ రేంజ్ సినీహీరోలే ఒకరి వెంట ఒకరుగా మరణిస్తుంటే..? ఏమనాలి. హతం హతః హతస్య అన్న చందంగా ఉంది అక్కడ పరిస్థితి.
గత కొన్ని రోజులుగా దక్షిణకొరియాకి చెందిన నటుల మిస్టీరియస్ డెత్ హాట్ టాపిక్ గా మారింది. ఒకరి తర్వాత ఒకరుగా పలువురు నటులు చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనమైంది. అవి సాధారణ మరణాలా అసాధారణమా? అన్నది తేలడం లేదు. మృత్యువుని ఎవరికి వారే ఆహ్వానిస్తున్నారా? లేక ఎవరైనా సైకో కిల్లర్ బారిన పడుతున్నారా? లేక అంతకు మంచి మరేదైనా అతీతమైన కారణం ఉందా? అన్న దానికి ఇప్పటివరకూ సరైన సమాధానం దొరకలేదు. పోలీసులు ఎంత అన్వేషిస్తున్నా.. విచారణ చేస్తున్నా అసలు నిజాలు నిగ్గు తేల్చలేకకపోతున్నారు. దీంతో ఆ మరణాలన్నింటిని అనుమానదాస్పద మరణాలుగా కేసు ఫైల్ చేసి సమాధులకు తరలిస్తున్నారు. గత ఆరు నెలలుగా దక్షిణ కొరియాలో ఇదే పరిస్థితి.
కొన్ని వరుస మరణాల అనంతరం .. తాజాగా మరో నటుడు ఆత్మ హత్య చేసుకోవడంతో కొరియా పరిశ్రమలో అసలు ఏం జరుగుతుందో అర్ధం కాని టెన్షన్ వాతావరణం అలుముకుంది. కొంత కాలం క్రితం కొరియన్ పాప్ స్టార్ సులీ పాతికేళ్ల వయసులో ఆత్మ చేసుకున్నాడు. అది జరిగిన ఆరు నెలలుకు గో హరా అనే ఆర్టిస్టు బాడీ అపార్ట్ మెంట్ లో దొరికింది. ఈ నేపథ్యంలో వీళ్లంతా నటన విషయంలో ఒత్తిడి పెరగడంతో ఆత్మ హత్య చేసుకున్నారని సందేహించారు. తాజాగా ది బ్యాంకర్.. లవ్ విత్ ప్లాస్ వంటి చిత్రాల్లో నటించిన ఛా ఇన్ హా అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.
అతడు ఆత్మహత్య కు పాల్పడ్డ అనవాళ్లు లేవు? ఎవరైనా చంపి వెళ్లారా? అన్న దానికి సమాధానం దొరకలేదు. దీంతో ఈ కేసును కూడా అనుమానదస్పద మృతిగా పోలీసులు నమోదు చేసారు. ఇలా వరుసగా దక్షిణ కొరియా ఆర్టిస్టులు మృతి చెందడంతో అక్కడి పరిశ్రమలో? ఏం జరుగుతోందో? అర్ధం కాని గందరగోళం కనిపిస్తోంది.