ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన టాప్ 5 సౌత్ హిందీ అనువాదాలు ఏవీ? అంటే వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఐదేళ్లుగా బాహుబలి 2 రికార్డ్ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ దేశంలో బాక్సాఫీస్ వసూళ్ల పరంగా టాప్ వన్ స్థానంలో బాహుబలి 2 నిలుస్తోంది.
ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ - పార్ట్ 1 రోజురోజుకు సంచలనం సృష్టిస్తూ 100 కోట్లు వసూలు చేయడం ఆశ్చర్యపరిచింది. నిదానంగా ప్రారంభమైన ఈ సినిమా వసూళ్లు అంతకంతకు పెరుగుతూ రాకెట్ స్పీడ్ తో వంద కోట్లను చేరుకోవడం ముంబై పరిశ్రమకు షాకిచ్చింది. పుష్ప హిందీ డబ్బింగ్ వెర్షన్ భారతీయ బాక్సాఫీస్ పై పెద్ద ప్రభావాన్ని చూపగలిగింది. సౌత్ నుంచి ఇంకా ఏవేవి ఉన్నాయి? అన్నది వెతికితే...
బాహుబలి 2 (ది కన్ క్లూజన్) 2017లో విడుదలైంది. ఇది బాహుబలి సిరీస్ లో రెండవ భాగం. రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇది ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ అనూహ్యంగా రూ. 520 కోట్లు వసూలు చేసింది. పరిశ్రమకు చెందిన వాణిజ్య పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది ఈ రిజల్ట్.
సూపర్ స్టార్ రజనీకాంత్ - ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన 2.0 ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. దాదాపు 190 కోట్ల వసూళ్లను సాధించింది ఈ చిత్రం. 2018లో విడుదలైన వాటిలో బెస్ట్ చిత్రంగా నిలిచింది. రజనీ మానియాతో సౌత్ బాక్సాఫీస్ వద్ద ఒక ఊపగా అక్షయ్ కుమార్ అసాధారణ నటనను వీక్షించేందుకు హిందీ ఆడియెన్ థియేటర్లకు క్య కట్టారు. సౌత్ కంటే నార్త్ లోనే 2.0 అధిక వసూళ్లను సాధించింది.
2019లో ప్రభాస్ నటించిన సాహో హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ ప్రకంపనలు సృష్టించింది. స్టైలైజ్డ్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్ సోషల్ మీడియాల్లో బోలెడంత క్రేజ్ ని తెచ్చుకుంది. హిందీ బాక్సాఫీస్ నుంచి ఏకంగా 145కోట్ల నెట్ ని రాబట్టగలిగింది. ఇది టాప్ 3లో ఇప్పటికీ కొనసాగుతోంది.
బాహుబలి-ది బిగినింగ్: ఫిక్షనల్ హిస్టారికల్ కంటెంట్ తో వచ్చిన ఫ్రాంఛైజీ ఇది. దేశంలో సరికొత్త ట్రెండ్ ను ప్రారంభించింది. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 2200 పైగా వసూలు చేయడం ఒక సంచలనం. దేశంలోనే అసాధారణ బడ్జెట్లతో కనీవినీ ఎరుగని స్థాయిలో రూపొందించిన చిత్రమిది. పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందడమే కాకుండా ఫ్రాంఛైజీకి ప్రత్యేకించి అభిమానులు ఏర్పడ్డారు. బాహుబలి 1 చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 119 కోట్లు వసూలు చేసింది. బాహుబలి 1 రికార్డు బద్దలు కొట్టడం కోసం చాలా మంది ప్రయత్నించి అప్పట్లో విఫలమయ్యారు.
పుష్ప: ది రైజ్ (పార్ట్ 1) 2021 డిసెంబర్ లో విడుదలైంది. తాజా హిందీ డబ్బింగ్ సౌత్ ఫిల్మ్ గా రూ. 100 కోట్లు వసూలు చేసింది. భారీ హిందీ చిత్రాలతో పోటీ ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఎదురే లేకుండా దూసుకెళ్లింది. పుష్ప: ది రైజ్ OTT విడుదల అయినప్పటికీ థియేటర్లలో వసూళ్ల హవాను కొనసాగించింది. గొప్ప అనుభూతిని కలిగిస్తేనే నేటి కాలంలో రిపీట్ ఆడియన్స్ రావడం సాధ్యమవుతుందని నిరూపించింది. 83 లాంటి బయోపిక్ చిత్రం డిజాస్టర్ రిజల్ట్ అందుకోగా అనువాద చిత్రం పుష్ప హిందీ ఆడియెన్ కి మరో లెవల్లో కనెక్టయ్యింది.
ఇక కన్నడ రంగం నుంచి వచ్చిన కేజీఎఫ్ కూడా హిందీ బాక్సాఫీస్ వద్ద 100కోట్లు పైగా వసూలు చేయడం ఒక సంచలనం. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తోంది. హిందీ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 సంచలనాలు నమోదు చేస్తుందన్న నమ్మకం ఉంది. ఇక మార్చి 25న వస్తున్న ఆర్.ఆర్.ఆర్ హిందీ వెర్షన్ రికార్డుల్ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డును ఆవిష్కరిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఆ తర్వాత పుష్ప సీక్వెల్ కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపిస్తుందన్న అంచనా ఏర్పడింది.