'అమ్మ' బ‌యోపిక్.. త్రిష‌ - న‌య‌న్ ఫియ‌ర్ స్టోరి!

Update: 2018-11-24 01:30 GMT
త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి. దివంగ‌త నాయ‌కురాలు జ‌య‌ల‌లిత‌పై త‌మిళంలో మూడు బ‌యోపిక్‌ లకు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూడు బ‌యోపిక్‌ల‌కు ప్ర‌స్తుతం క‌థానాయిక‌ల సెర్చ్ సాగుతోంది. ఇప్ప‌టికే ఓ బ‌యోపిక్ టైటిల్‌ ని ప్ర‌క‌టించారు. `ది ఐర‌న్ లేడి- ఏ స్టోరి ఆఫ్ రివ‌ల్యూష‌న‌రీ లీడ‌ర్` పేరుతో తెర‌కెక్కనున్న  ఈ బ‌యోపిక్‌ లో క‌థానాయిక‌గా నిత్యామీన‌న్‌ ని ఫైన‌ల్ చేశారు.  ఈ చిత్రాన్ని ప్రియ‌ద‌ర్శిని ద‌ర్శ‌క‌త్వంలో పందెంకోడి నిర్మాత లింగుస్వామి రూపొందిస్తున్నార‌ట‌. ఫిబ్ర‌వ‌రి 24న ఈ బ‌యోపిక్ లాంచ్ కానుంది. జ‌య‌లలిత లుక్‌ కి నిత్యా ప‌క్కాగా స‌రిపోతుంద‌ని - నిత్యా కెరీర్‌ కి ఈ చిత్రం మైలు రాయి కానుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

ఇక వేరే రెండు బ‌యోపిక్‌ ల మాటేమిటి? క‌థానాయిక‌లుగా ఎవ‌రు ఎంపిక‌య్యారు? అంటే ఇప్ప‌టికి ఇంకా స‌రైన ఆన్స‌ర్ రాలేదు. అయితే ఆ రెండు బ‌యోపిక్‌ ల‌కు స‌న్నాహాలు సాగుతున్నాయి. వాటిని క్లోజ్‌ గా వాచ్ చేస్తున్న ఓ బ‌యోపిక్ డైరెక్ట‌ర్ అందించిన వివ‌రాల ప్ర‌కారం.. ఇప్ప‌టికే నిర్మాత‌లు న‌య‌న‌తార‌ - త్రిష‌ల‌ను సంప్ర‌దించార‌ట‌. అయితే అట్నుంచి ఓకే కాలేద‌ట‌. జ‌య‌ల‌లిత పాత్ర అన‌గానే వివాదాల గురించి ఆ ఇద్ద‌రూ ఆలోచించార‌న్న మాటా వినిపిస్తోంది.

అమ్మ జ‌య‌ల‌లితకు అత్యంత స‌న్నిహితురాలు అయిన త్రిష‌కు ఆఫ‌ర్ వ‌చ్చినా భ‌య‌ప‌డి చేయ‌న‌ని చెప్పేసిందిట‌. అలాగే న‌య‌న‌తారను సంప్ర‌దిస్తే నేను సూట‌వ్వ‌న‌ని సున్నితంగా తిర‌స్క‌రించింద‌ని చెబుతున్నారు. అయితే ఆ ఇద్ద‌రూ ఇలా వెన‌క‌డుగు వేయ‌డానికి కార‌ణం త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత‌కు ఉన్న పిచ్చి ఫ్యానిజ‌మే కార‌ణమ‌ట‌. అలాగే ది గ్రేట్ ఎంజీఆర్ ఫ్యాన్స్ నుంచి ఏదైనా తేడా వ‌స్తే ఆగ్ర‌హం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమ్మ విష‌యంలో తేడాలొస్తే తాట ఒలుస్తార‌న్న భ‌యం అంద‌రికీ ఉంటుందిట‌. అంతేకాదు.. తంబీ ఫ్యాన్స్ రెస్పాన్స్ చాలా క‌ఠోరం గానే ఉంటుంద‌ని, అందుకే ఆ ఇద్ద‌రూ వెన‌క‌డుగు వేశార‌ని `రాకుమారుడు` (క‌త్తి కాంతారావు బ‌యోపిక్) ద‌ర్శ‌కుడు చెబుతున్నారు. ఇక ఇప్ప‌టికే ఏ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో అమ్మ జ‌య‌లలిత‌పై బ‌యోపిక్ తెర‌కెక్కిస్తామ‌ని విబ్రి మీడియా అధినేత విష్ణు ఇందూరి ప్ర‌క‌టించారు.  అలాగే వేరొక ప్రొడ‌క్ష‌న్ హౌస్ మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో జ‌య‌ల‌లిత‌పై బ‌యోపిక్‌ ని ప్రారంభించేందుకు రాజీ లేకుండా ప‌ని చేస్తోందిట‌. మ‌రోవైపు త‌మిళ‌నాడులో ఎంజీఆర్ బ‌యోపిక్ ఆన్ లొకేష‌న్ ఉన్న సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News