అందాల సోయగం త్రిష టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. చెన్నై తర్వాత హైదరాబాద్ రెండవ ఇల్లు లాంటింది. అలాంటి ఇంటి అవకాశాల్ని ఎందుకు వదులుకుంటానంటూ చాలాసార్లు చెప్పుకొచ్చింది. కానీ అమ్మడు ఆ మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. వచ్చిన అవకాశాల్ని సైతం వదులుకుని మాతృభాషకే పెద్ద పీట వేసింది.
సొగసరి వయసు 40కి చేరువలో ఉన్నా? తెలుగులో అవకాశాలు వస్తున్నా? వదులుకుంది. కొన్ని లేడీ ఓరియేంటెడ్ ఆఫర్లు సైతం తిరస్కరించింది. ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసిన పాత్రకు త్రిషనే ముందు అనుకున్నారు. కానీ అమ్మడు రిజెక్ట్ చేయడంతో ఆ ఛాన్స్ కాజల్ కి వెళ్లింది. ఈ క్రమంలో త్రిష యాటిట్యూడ్ పై కొంత నెగిటివ్ పబ్లిసిటీ ఊపందుకుంది.
త్వరలోనే ఈ భామ పొన్నియన్ సెల్వన్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత త్రిష నటించిన సినిమా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఈవెంట్ లో పాల్గొన్న త్రిష అందంతో మరోసారి యువతని ఫిదా చేసింది. తెలుగు స్పీచ్ తో అదరతగొట్టేసింది.
తెలుగు లో బిజీగా ఉన్నంత కాలం ఏనాడు తెలుగు మాట్లాడింది లేదు. కానీ ఈవెంట్ లో మాత్రం ఎంతో చక్కగా తెలుగు భాషతో ఆకట్టుకుంది. ఆంధా..తెలంగాణ అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకొస్తున్న నిర్మాత దిల్ రాజు కి స్పెషల్ థాంక్స్ చెప్పింది. ఇలాంటి కొన్ని సన్నివేశాలు అమ్మ డిపై నెగివిటినీ తొలగించేలా చేస్తున్నాయి.
త్రిష స్టెజ్ అప్పీరియన్స్ అందర్ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో అమ్మడు మళ్లీ టాలీవుడ్ పై మనసు పడుతుందా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అదే జరిగితే సీనియర్ హీరోలకు సరిజోడీగా కుదురుతుంది. చిరంజీవి ... బాలయ్య..వెంకటేష్..నాగార్జున లాంటి హీరోలతో కలిసి పనిచేసినా అమ్మడి అందం..ఛరష్మా ఏ మాత్రం చెక్కు చెదరలేదు కాబట్టి ఇంకొన్నాళ్లు లాగించొచ్చు.
ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి మారిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇమేజ్ ఇప్పుడు పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ కి రీచ్ అవుతుంది. ఇలాంటి క్రమంలో ఎలుగెత్తిన ఎలాంటి హీరోయిన్ అయినా కిందకి దిగి రావాల్సిందే. అది తెలుగు సినిమా సత్తా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.