ధనుష్ సరసన త్రిష

Update: 2015-11-01 09:57 GMT
ధనుష్ - త్రిష.. ఇద్దరిదీ దాదాపుగా ఒకే వయసు. వాళ్లిద్దరి కెరీర్ కూడా ఒకేసారి ఆరంభమైంది. ఇద్దరూ స్టార్ స్టేటస్ సంపాదించారు. ఐతే ఇద్దరూ పీక్స్ లో ఉండగా జంటగా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ.. అవి ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడు ధనుష్ రేంజి ఇంకా పెరిగింది. బాలీవుడ్లో సైతం దూసుకెళ్తున్నాడు. ఐతే త్రిష కెరీర్ దాదాపుగా ఎండింగ్ కు వచ్చేసింది. ఐతే ఈ సమయంలో ధనుష్ సరసన త్రిష నటించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దురై సెంథిల్ కుమార్ అనే దర్శకుడితో ధనుష్ నటించబోయే సినిమాలో త్రిష ఓ హీరోయిన్ గా నటించబోతోందట.

ధనుష్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తాడట. అన్నదమ్ములుగా కనిపించబోతున్నాడతను. తమ్ముడి పాత్రకు జోడీగా షామిలి నటించబోతోంది. అన్న క్యారెక్టర్ కు జంటగా త్రిష నటిస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ప్రస్తుతం సమంతతో కలిసి ‘తంగమగన్’ సినిమాలో నటిస్తున్నాడు ధనుష్. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కాబోతోంది. మరోవైపు త్రిష.. రెండేళ్ల ముందు దాదాపుగా ఫేడవుట్ అయిపోయినట్లు కనిపించింది కానీ.. మళ్లీ ఇప్పుడు హీరోయిన్ గా బిజీ అవుతోంది. ఆమె చేతిలో ఇప్పటికే మూడు సినిమాలున్నాయి. ఈ వయసులో ధనుష్ లాంటి స్టార్ తో సినిమా దక్కించుకుందంటే త్రిషది అదృష్టమే.
Tags:    

Similar News