త్రిష డిప్రెషన్ లో ఇలా చేసిందా..?

Update: 2020-06-15 14:00 GMT
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుస సంఘటనలు కొందరు సెలబ్రిటీల జీవితాలను బాగా ప్రభావితం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవలే టిక్ టాక్ వీడియోలతో అభిమానులను పలకరించిన త్రిష.. ఫ్యాన్స్ తో బాగానే టచ్ లో ఉంది అనుకోగానే మళ్లీ సడన్ షాక్ ఇచ్చింది. ఇక తాజాగా ఇండస్ట్రీని కుదిపేసిన సంఘటన.. హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య. అయితే సుశాంత్ మానసికంగా ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అతని మరణం సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది డిప్రెషన్ గురించి నోరువిప్పుతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాకి దూరంగా ఉండబోతున్నట్లు చెప్పిన త్రిష.. కెరీర్ పరంగా మంచి జోష్ లో ఉంది. ఆమె చేతిలో ప్రస్తుతం ఆరు పెద్ద సినిమాలు ఉన్నాయట. సినిమాల పరంగా ఇంత బిజీగా ఉన్న త్రిష.. "ప్రస్తుతానికి నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలియకుండా ఉండటం మంచిది.

మైండ్‌కు ఇది డిజిటల్‌ చికిత్స లాంటిది. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. లవ్‌ యూ గాయ్స్‌.. త్వరలోనే కలుద్దాం" అంటూ ట్వీట్‌ చేసింది. ఈ పోస్ట్ చూసి నెటిజన్లకు అభిమానులకు ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి కారణం వ్యక్తిగత జీవితంలో ఆనందం లేదని అంటున్నారు. ఒక వైపు తన పెళ్లి ఆగిపోవడం.. మరో వైపు మాజీ లవర్ పెళ్లి వార్త తెలియడం.. ఇక తాజాగా డిప్రెషన్ లతో యాక్టర్ల మరణాలు.. ఇవన్నీ చూస్తుంటే త్రిష ఎంతో మనోవేదనకు గురై డిప్రెషన్ లోకి వెళ్తుందేమో అని ఇలా సోషల్ మీడియాకి సెలవు పెట్టినట్లు సమాచారం. ఈరోజుల్లో ఏ వార్త తెలిసినా సోషల్ మీడియా ద్వారానే తెలుస్తుంది కాబట్టి.. డిప్రెషన్ లోకి వెళ్లే ముందే దూరంగా ఉండటం బెటర్ అనుకున్నట్లు టాక్. కానీ ఏదేమైనా త్రిషను మిస్ అవబోతున్నారట ఫ్యాన్స్.
Tags:    

Similar News