కరివేపాకు జనాలు త్రిషకు నచ్చరట

Update: 2017-06-25 06:45 GMT
చెన్నై బ్యూటీ త్రిషా కృష్ణన్ వయసు ఇప్పుడు 34 సంవత్సరాలు. టీనేజ్ లోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం హీరోయిన్ 15 ఏళ్ల కెరీర్ ను కూడా ఫినిష్ చేసేసింది. ఇంత సుదీర్ఘకాలం హీరోయిన్ గా కెరీర్ కొనసాగించిన అతి కొద్ది మందిలో త్రిష పేరు టాప్ లోనే ఉంటుంది. ఇంకా ఈ చెన్నై భామ చేతిలో దాదాపు అరడజన్ సినిమాలు ఉన్నాయంటే.. త్రిష క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధమవుతుంది.

ఇంత సుదీర్ఘకాలం హీరోయిన్ గా తాను కంటిన్యూ అవడానికి.. మంచి కథలు కుదరడం.. ట్యాలెంట్ ఉన్న దర్శకులతో సినిమాలు చేయడమే కారణం అంటోంది త్రిష. తను ఎప్పుడూ కథకు తొలి ప్రాధాన్యం ఇస్తానన్న ఈమె.. ఆ తర్వాతే తన కేరక్టర్ గురించి చూస్తుందట. రెమ్యూనరేషన్ ను పెద్దగా పట్టించుకోనని చెప్పిన త్రిష.. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకున్నపుడు తెగ గర్వంగా ఫీలవుతానని అంటోంది. తనకు అణకువగా ఉండేవారు- గౌరవంగా వ్యవహరించేవారు అంటే ఇష్టమన్న ఈ భామ.. కరివేపాకులా అవతలి మనుషులను ట్రీట్ చేసే జనాలంటే అస్సలు నచ్చరని చెబుతోంది.

వన్ సైడ్ లవ్ గురించి చెప్పడానికి త్రిషకు అసలు చేతకాదట. తనెప్పుడూ వన్ సైడ్ లవ్ చేయకపోవడంతోనే ఈ టాపిక్ పై అసలు మాట్లాడలేనని చెబుతోందీ చెన్నై సుందరి. అయితే.. ఇద్దరి మనసులు కలిస్తే మహిళలు తనకంటే చిన్న వయసున్న వ్యక్తి పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదని తన అభిప్రాయం చెప్పింది త్రిష.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News