రాజ‌కీయాల్లోకి త్రిష‌

Update: 2016-02-17 13:29 GMT
త్రిష...తెలుగులోనే కాదు త‌మిళంలోనూ టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రు. ఇటీవ‌లి కాలంలో తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిపోయిన నేప‌థ్యంలో ఆమె తమిళ‌నాడులో తన అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది. అక్క‌డ మంచి అవకాశాలే ద‌క్కుతున్న‌ప్ప‌టికీ...స‌డ‌న్‌గా త్రిష‌ రాజ‌కీయాల్లోకి రానుంద‌నే వార్త‌లు చెన్నైలో గుప్పుమంటున్నాయి. ఇందుకు కార‌ణం కూడా లేక‌పోలేదండోయ్‌. ఈ ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కాంగ్రెస్‌ - డీఎంకే వంటి పార్టీలు పొత్తులు కుదుర్చుకున్నాయి. మ‌రోవైపు బీజేపీ-అన్నా డీఎంకేలు ద‌గ్గ‌ర‌వుతున్న వాతావ‌ర‌ణం ఉంది. ఈ క్ర‌మంలో రాజ‌కీయ నాయకురాలి గెట‌ప్ ఉన్న త్రిష ఫ్లెక్సీలు చెన్నై వీధుల్లో వెలిశాయి.

దీంతో సినీ ఇండ‌స్ర్టీ వ‌ర్గాలే కాకుండా...రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఏంటి త్రిష కృష్ణ‌న్ సినిమాలు వ‌దిలిపెట్టి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు రాబోయే ఎన్నిక‌ల‌ను వేదిక‌గా చేసుకుందా అని గుస‌గుస‌లు షురూ అయిపోయాయి. అయితే ఈ డిస్క‌ష‌న్ల‌కు ఫుల్‌ స్టాప్ పెట్టేలా సినీవ‌ర్గాల్లోని కొంద‌రు క్లారిటీ ఇచ్చారు. సుప‌ర్‌ స్టార్ ర‌జినీకాంత్ అల్లుడు ద‌నుష్ తానే నిర్మాత‌గా ఉండి దురై సెంథిల్‌ కుమార్ డైరెక్షన్‌ లో రానున్న 'కోడి' చిత్రానికి సంబంధించిన స్టిల్స్ లోని కొన్ని ఫొటోలే ఆ ఫ్లెక్సీలు అని తేల్చారు. తొలిసారి ద‌నుష్‌ డబుల్ రోల్‌  లో కనిపించనున్న ఈ సినిమా క‌థాంశం పొలిటిక్ బ్యాక్‌ డ్రాప్‌. ఇక ఇందులో హీరోయిన్‌ గా త్రిష ఉన్న నేప‌థ్యంలో స‌ద‌రు పాత్ర‌కు ద‌గ్గ వ‌స్త్రాధ‌ర‌ణ‌లో క‌నిపించ‌డం త‌ప్ప‌నిస‌రి క‌దా. అందుకే రాజ‌కీయ‌ నాయ‌కురాలి గెట‌ప్‌ లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇదంతా తెలియ‌కపోవ‌డం వ‌ల్ల ఫ్లెక్సీల‌తో త్రిష పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి టాక్స్ మొద‌ల‌య్యాయి. ఇంత‌కీ త్రిష పాత్ర‌ పేరు ఏంటంటారా. ఆమె పోషించే పాత్ర పేరు 'రుద్ర'. ప్ర‌జ‌ల కోసం పోరాడే రాజకీయ నాయకురాలిగా కోడి సినిమాలో ఆమె కనిపిస్తారట‌.
Tags:    

Similar News