మొన్నామధ్యన తెగ రూమర్లు వచ్చేశాయి. అసలు బెంగుళూరులో త్రిష నెలకొల్పబోయే ఫైవ్ స్టార్ హోటల్ రేంజు మామూలుగా లేదని.. ఆమె తన తండ్రి జ్ఞాపకార్ధంగా ఈ హోటల్ పెడుతోందని.. అబ్బో నానా రచ్చే జరిగింది. అయితే త్రిష మాత్రం ఈ బిజెనస్ లోకి దిగుతోందా లేదా అనే క్లారిటీ ఇవ్వకుండా అందరినీ ఉతికి ఆరేసింది. ఇంతకీ అసలు త్రిష తన నోటితో తాను ఏం చెప్పిందో తెలుసా?
ఈ మధ్యన మన డస్కీ హీరోయిన్ సినిమాల విషయంలో కాస్త వెనుకపడినా కూడా.. మీడియాతో ముచ్చట్లు పెట్టే యవ్వారంలో మాత్రం బాగా ముందడుగులే వేస్తోంది. ఆ సందర్బంగా ఇప్పుడు అమ్మడు తన హోటల్ గురించి అసలు విషయం చెప్పేసింది. ''హీరోయిన్ లైఫ్ అంతే.. పాజిటివ్స్ ఏంటంటే.. ఒక కొత్త స్టాటస్ ఎంజాయ్ చేస్తాం. ఎక్కడకెళ్ళినా ఫాలోయింగ్.. అటెన్షన్ ఉంటాయ్. కాని మైనస్సులు ఏంటంటే.. అసలు మనకు తెలియకుండానే మన గురించి న్యూస్ వచ్చేస్తుంది. అదిగో మొన్న నేను బెంగుళూరులో హోటల్ పెడుతున్నానంటూ వార్తలొచ్చాయి. ఏ మాత్రం నిజం లేకపోయినా కూడా అందరూ నమ్మేస్తారు'' అంటూ చెప్పుకొచ్చింది.
మొత్తానికి అమ్మడు ఎటువంటి బిజినెస్సూ పెట్టే యోచనలో లేదన్నమాట. అయితే విషయం ఏంటంటే.. ఎలాగో పెళ్ళయినా కూడా కరీనా కపూర్ తరహాలో యాక్టింగ్ లోనే కొనసాగాలని అనుకుంటోంది కాబట్టి.. ఇక వేరే బిజెనెస్సులు ఎందుకులే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/