తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటిస్తున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ప్రారంభమైంది. `సార్` అనేది తెలుగు టైటిల్ కాగా `వాతి` అనేది తమిళ టైటిల్. నేడు హైరాబాద్ లో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ నిచ్చి ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశాన్ని ధనుష్ - కథానాయిక సంయుక్తలపై చిత్రీకరించారు.
ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా సితార సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఒక సామాన్యుడి హృదయ సంబంధమైన ప్రతిష్టాత్మక ప్రయాణానికి శుభారంభం.. అంటూ ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది చిత్రబృందం. #వాతి / #సార్ ఈరోజు పూజతో బయలుదేరారు. జనవరి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని టీమ్ వెల్లడించింది. జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
ధనుష్ ఇటీవల వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు తమిళం-హిందీ ద్విభాషా చిత్రాలతో పాటు ఇటు తమిళం- తెలుగు ద్విభాషా చిత్రాలపైనా ఫోకస్ చేశారు. తెలుగు.. హిందీ అగ్ర బ్యానర్లతో కలిసి సినిమాలు చేస్తున్నారు. మారిన ట్రెండ్ లో తన మార్కెట్ రేంజును విస్తరించుకునే పనిలో ఉన్నారు. ధనుష్ నటించిన అట్రాంగిరే ఇటీవల ఓటీటీలో విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే.