మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ రైట్స్ ను త్రివిక్రమ్ రాధాకృష్ణలకు సన్నిహితుడు అయిన నాగవంశీ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆయన గత కొన్ని నెలలుగా ఈ రీమేక్ విషయంలో పలువురిని సంప్రదించాడంటూ వార్తలు వచ్చాయి. అయితే మల్టీస్టారర్ అవ్వడంతో ఎవరు కూడా సాహసం చేయలేక పోయారు. రీమేక్ స్క్రిప్ట్ త్రివిక్రమ్ వద్దకు వెళ్లింది అంటూ వార్తలు వచ్చాయి. ఆయన స్క్రిప్ట్ ను రెడీ చేసి పవన్ వద్దకు తీసుకు వెళ్లారట.
సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చడంతో పవన్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ రీమేక్ బాధ్యతలను తొలి ప్రేమ మరియు మిస్టర్ మజ్ను చిత్రాలను తెరకెక్కించి ప్రస్తుతం నితిన్ తో రంగ్ దే చిత్రాన్ని చేస్తున్న దర్శకుడు వెంకీ అట్లూరి చేతిలో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు క్రిష్ మరియు హరీష్ శంకర్ ల సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు. ఆ సినిమాల తర్వాత పవన్ ఈ సినిమా చేసే అవకాశం ఉందంటున్నారు.
ఈ చిత్రంలో పవన్ తో పాటు కీలక పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించబోతున్నాడట. త్రివిక్రమ్ సమర్పించనున్న ఈ సినిమాకు రాధాకృష్ణ కూడా ఒక నిర్మాత కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా వచ్చే నెలలో ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. హరీష్ శంకర్ మూవీ కంటే ముందుగా ఈ సినిమా పట్టాలెక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.