'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమా గురించి అందరికీ తెలిసిందే. విమర్శకులకు నచ్చకపోయినా కూడా 50 కోట్లు షేర్ వసూలు చేసిందా సినిమా. అయితే ఆ సినిమాకు తొలి రోజు యావరేజ్ రేటింగ్స్ రావడం కేవలం అల్లు అర్జున్ అభిమానులకే కాదు.. త్రివిక్రమ్ ఫ్యాన్స్ కు కూడా రుచించలేదు. అయితే సాధారణంగా క్రిటిక్స్ బాలేదని చెప్పినా కూడా సినిమాకు డబ్బులొచ్చాయి కాబట్టి.. కావాలంటే దర్శకుడు త్రివిక్రమ్ రివ్యూలు రాసే వారిని బూతులు తిట్టి ఉండొచ్చు. కాని అక్కడే తన నిజమైన స్వభావం చూపించాడు మాటల మాంత్రికుడు.
తన సినిమాకు క్రిటిక్స్ అందరూ నెగెటివ్ రివ్యూలు ఇచ్చినందుకు బాగా ఫీలయ్యాడట త్రివిక్రమ్. అందుకే తన తదుపరి సినిమాతో తన అసలు టాలెంట్ ఏంటో చూపిస్తానని చెప్పుకొచ్చాడట. అందుకే చాలా కష్టపడి ఈ కథను వర్కవుట్ చేసి అందులో ప్రతీ మైన్యూట్ లేయర్ ను చాలా సున్నితంగా హ్యాండిల్ చేసి ఈ సినిమాను తయారు చేశాడంట. తన తదుపరి సినిమాతో సత్తా ఏంటో చూపిస్తానంటూ చాలాసార్లు నితిన్ అండ్ సమంతలకు చెబుతూ ఉండేవాడట. ఇప్పుడు చెప్పినట్లే మనోడు పాజిటివ్ రివ్యూలు.. పాజిటివ్ కలక్షన్లతో పిచ్చెక్కిస్తున్నాడు.
రివ్యూల మీద పడి ఏడ్చే చాలామంది ఫిలిం మేకర్లకు బహుశా త్రివిక్రమ్ ఒక మాంచి ఉదాహరణ. తన కంటెంట్ తో క్రిటిక్స్ ను గెలుచుకున్న ఈ డైరక్టర్ ను చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి.