కేరక్టర్ పేర్లలో త్రివిక్రమ్ కొత్త స్టైల్..

Update: 2015-09-10 22:42 GMT
అ.. ఆ.. అంటూ తన నెక్ట్స్ మూవీకి పేరు ఫిక్స్ చేశాడు త్రివిక్రమ్. దీనికి అర్ధం అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విరాజ్. ఈ మూవీలో అనసూయ కేరక్టర్ ని సమంత పోషిస్తుండగా.. ఆనంద్ కేరక్టర్ ని నితిన్ చేయబోతున్నాడు. మళయాళ ప్రేమమ్ లో తళుక్కుమన్న అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ చిత్రంలో మరో లీడ్ కేరక్టర్ చేయనుంది.

ఈ నేమ్స్ ద్వారా... త్రివిక్రమ్ కేరక్టర్ లకు విభిన్నమైన పేర్లను ఎంచుకుంటున్నారనే విషయం అర్ధమవుతోంది. అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ పేరు గౌతమ్ నందా. నందాస్ ఫ్యామిలీ అంటూ.. హడావిడి బాగా కనిపిస్తుంది. దీనికి ముందు జులాయిలో అల్లు అర్జున్ కేరక్టర్ పేరు రవీంద్ర నారాయణ్. పేర్లలో తమిళ టచ్ ఉన్నట్లు అనిపించినా.. త్రివిక్రం టేకింగ్ మూలంగా.. ఎక్కడా మనకు ఆ ఫీల్ కనిపించదు. ఇప్పుడు అనసూయ రామలింగమ్, ఆనంద్ విరాజ్ లాంటి పేర్లంటే.. ఫుల్ లెంగ్స్ తమిళ పేర్లే. మాటల మాంత్రికుడు

పేర్ల విషయంలోనూ కొత్త పంథా ఫాలో అవుతున్నాడు. మనకు వినిపించని పేర్లు, తెలీని పేర్లను పట్టుకొచ్చి... కొత్తదనాన్ని అక్కడినుంచే అందించే ప్రయత్నం చేస్తున్నాడు త్రివిక్రమ్. అంతేకాదు.. తొలిసారిగా నటరాజ్ సుబ్రమణ్యమ్ కి తమిళియన్ కి సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా అప్పగించాడీ మాంత్రికుడు. ఇప్పుడీ . అ.. ఆ... మూవీని టాప్ స్పీడ్ లో కంప్లీట్ చేయబోతున్నాడు. సాధారణంగా ఒక్కో సినిమాకి సంవత్సరం టైం తీసుకునే ఈ దర్శకుడు... దీన్ని మాత్రం 3 నెలల్లోనే పూర్తి చేసేసి, సంక్రాంతినాటికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.
Tags:    

Similar News